కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు.ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు.
ఇప్పటికే విడుదల అయిన ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ గ్లింప్స్, ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పాట మరియు ఇతర కంటెంట్ వల్ల ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో చిత్రీకరించిన ‘బెదురులంక 2012’, అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్బంగా చిత్రనిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే కొత్త తరహా డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.” అని చెప్పారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “సామాజిక మాధ్యమాల్లో మా చిత్రానికి సంబంధించిన కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ, ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’, మిగతా క్యారెక్టర్లు, పాటలు మరియు గోదావరి ఒడ్డున లొకేషన్లు అన్నీ మీకు చాలా నచ్చుతాయి. ఒక కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతి తో పాటు సినిమా అంతటా నవ్వుతూనే ఉంటారు.” అని చెప్పారు.
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్.