జేడీ లక్ష్మీనారాయణ క్లాప్‌తో ప్రారంభమైన ‘సిగ్గు’ చిత్రం

జాతీయ అవార్డు గ్రహిత నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై 116వ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి జేడీ లక్ష్మీనారాయణ క్లాప్‌ ఇవ్వగా, కె. విజయేంద్ర ప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వి వి వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. సి. కళ్యాణ్‌, దామోదర ప్రసాద్‌ స్ర్కిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు.

అనంతరం నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘నేను చిత్ర పరిశ్రమకి వచ్చి కచ్చితంగా 20 సంవత్సరాలు పూర్తయింది. మొదటి నుంచి నన్ను అబి?మానించి అక్కున చేర్చుకున్న వ్యక్తి కళ్యాణ్‌ గారు. ఆయన సపోర్ట్‌తో ముందుకెళ్తున్నాను’’ అని అన్నారు.
జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘‘సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీయాలని సమాజాన్ని పాడు చేసే సినిమాలు తీయకూడదు అని నేను క్లాప్‌ కొట్టాను. కాబట్టి మంచి సినిమా తీయించే బాధ్యత ఈ బృందంపై ఉంది. ఆ నమ్మకంతోనే క్లాప్‌ కొట్టాను’’ అన్నారు.

దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ ‘‘రామ సత్యనారాయణగారి బ్యానర్‌లో గతంలో కూడా పని చేశా. నాపై నమ్మకంతో ఆయన ఏరోజు సెట్‌లో అడుగుపెట్టరు. పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఆ నమ్మకంతోనే నాకు మళ్లీ అవకాశం ఇచ్చారు. చలం గారి నవల సుశీల ఆధారంగా ఈ సినిమా చేస్తున్నా. నాకు రెగ్యులర్‌ గా వర్క్‌ చేేస టీమ్‌ ఈ సినిమాకి వర్క్‌ చేస్తున్నారు. నటీనటుల ఎంపిక పూర్తయిన తర్వాత ఇతర వివరాలు వెల్లడిస్తా.’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో దామోదర ప్రసాద్‌, ప్రసన్నకుమార్‌, వంశీ రామ రాజు, రేలంగి నరసింహ రావు, ధర్మ రావు, సతీష్‌ వర్మ, గుడా రామకృష్ణ పాల్గొన్నారు.

ఈ చిత్రానికి
కెమెరా: అబ్బూరి ఈషే
ఎడిటర్‌: వి నాగిరెడ్డి,
సంగీతం: సుక్కు,
నిర్మాణ సంస్థ : భీమవరం టాకీస్‌
నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ
రచన – దర్శకత్వం : నరసింహ నంది.