హృతిక్ రోషన్ భారీ యాక్షన్ చిత్రం ఫైటర్ నుండి “షేర్ కుల్ గయ” పాట విడుదల !!!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థల పై మమతా ఆనంద్, రామన్ చిబ్, మరియు అంకు పాండే గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దీనిని 2024 జనవరి 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఫైటర్ మూవీ నుండి “షేర్ కుల్ గయ” సాంగ్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్, హృతిక్ రోషన్ , దీపికా పదుకొనె డాన్స్ మూమెంట్స్ ఫాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ , హృతిక్ రోషన్ కాంబినేషన్ లో గతంలో “బ్యాంగ్ బ్యాంగ్” మరియు “వార్” సినిమాలు సంచలన విజయాలు సాధించాయి, ఆ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా మరింత ఎక్కువ అంచనాలతో ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

FIGHTER: Sher Khul Gaye (Song) | Hrithik Roshan,Deepika Padukone |Vishal Sheykhar |Kumaar |Bhushan K