War 2: ‘వార్ 2’ నుంచి హృతిక్ రోషన్, కియారా అద్వానీ రొమాంటిక్ సింగిల్ ‘ఊపిరి ఊయలలాగా’ విడుదల

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘వార్ 2’ నుంచి మొదటి ట్రాక్‌ విడుదల అయింది. సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ‘ ఊపిరి ఊయలలాగా’ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. “బ్రహ్మాస్త్ర”లోని బ్లాక్‌బస్టర్ పాట ‘కేసరియా’ పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు.

Oopiri Ooyalaga Song | WAR 2 | Hrithik Roshan, Kiara Advani | Pritam, Shashwat, Nikhita |Chandrabose

ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. తెలుగులో ఈ పాటను శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అధ్భుతంగా ఉన్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఆదిత్య చోప్రా నిర్మించిన “వార్ 2” ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

Public Reaction On Ys Jagan Nellore Tour || Chandrababu || Ap Public Talk || Pawan Kalyan || TR