తెలుగు సినిమాలకు రీచ్ ఎక్కువ, అలాగే ఇక్కడ నటులకు గౌరవం కూడా ఎక్కువ: హీరోయిన్ సంజన శెట్టి.

మాది కర్ణాటక, తులు మా మదర్ టాంగ్, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అందుచేత బి.కామ్ తరువాత ఇంటీరియర్ డిజైనర్ కోర్స్ నేర్చుకున్నాను. అలాగే మాడలింగ్ చేస్తూ యాక్టింగ్ లో మెలకువలు నేర్చుకున్నాను. అలాగ కొన్ని జ్యూవెలరి యాడ్స్ చేశాను.

పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు చెయ్యడం ఇష్టం. డీ గ్లామర్ రోల్స్ లో యాక్టింగ్ కు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. తెలుగు సినిమాలకు రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆర్టిస్ట్ లకు గౌరవం కూడా అలాగే ఉంటుంది. అందుచేత ఎక్కువ తెలుగు సినిమాలు చెయ్యాలని ఉంది.

ఎక్కువ తెలుగు సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నాను, దానితో నాకు తెలుగు అర్థం అవుతుంది, మాట్లాడడం కూడా నేర్చుకుంటున్నాను. ఒకటి రెండు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను.

షారుక్, కాజోల్ నటించిన కుచ్ కుచ్ హొతా హై నా ఫెవారేట్ సినిమా. వారిద్దరి కెమెర్ట్రీ , స్క్రీన్ ప్రెజెన్స్ నాకు బాగా ఇష్టం. అలాగే మహేష్ బాబు గారి సినిమాలు ఎక్కువ చూస్తాను. ఎప్పటికైన మహేష్ బాబుతో నటించాలనేని నా కోరిక.

నటికి ఒక్క మంచి సినిమా పడితే చాలు మంచి గుర్తింపు లభిస్తుంది. కథ బలం ఉన్న సినిమాలు చేయడానికి చూస్తున్నాను. త్వరలో నేను నటించే ఒక సినిమా గురించి చిత్ర యూనిట్ అనౌన్స్ చేయబోతున్నారని నటి సంజన శెట్టి తెలిపింది.