మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతున్న సుమంత్ మహేంద్రగిరి వారాహి గ్లిమ్స్ !!!

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు – 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు.

మహేంద్రగిరి వారాహి గ్లిమ్స్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. అంతేకాకుండా యూట్యూబ్ లో మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకెళుతోంది.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

సుమంత్ , మీనాక్షి గోసామి, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు, కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు కథ మురళి రచన , దర్శకత్వం సంతోష్ జాగర్లపూడి.

MAHENDRAGIRI VARAHI First Glimpse | Sumanth | Meenakshi | Santhossh Jagarlapudi | Anup Rubens