Swag Movie: కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అందరికీ వెల్ కమ్. ‘శ్వాగ్’ సినిమా ‘రాజ రాజ చోర’ ఎడింగ్ కి వచ్చినప్పుడు చేద్దామని అనుకున్నాం. హసిత్ ఆరేడు నెలల తర్వాత స్క్రిప్టు పూర్తి చేసి చెప్పాడు. కథ విని ఆశ్చర్యపోయా. చాలా పెద్ద కథ. వంశాలు, తరాలకు సంబంధించిన ఇంత పెద్ద కథను చెప్పడం ఈజీ కాదు. అప్పటికి నేను ఏ సినిమాలోనూ డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రలు పోషించాలనగానే కొంచెం భయమేసింది. కానీ, హసిత్‌పై నాకు నమ్మకం ఉంది. తను ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసు. దినికి తోడు డైరెక్షన్ టీం, మా వివేక్ సాగర్, విప్లవ్ వీళ్ళంతా యాడ్ అవ్వడంతో ధైర్యం వచ్చింది. ఎంత మంచి కథైనా తెరకెక్కాలన్నా.. అది ప్రేక్షకుల ముందుకు రావాలన్నా నిర్మాత కావాలి. టీజీ విశ్వ ప్రసాద్ గారు వంద కాదు రెండు వందల సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందులో పది పదిహేను సినిమాలు నాకూ ఇవ్వాలని కోరుకుంటున్నాను.(నవ్వుతూ). అక్టోబర్ 4న ఈ సినిమా గట్టిగా కొట్టబోతోంది. విశ్వ గారు, వివేక్ గారు ఈ సినిమాకి చేసిన సపోర్ట్ మర్చిపోలేం. మిగతా సినిమాల కంటే ఈ సినిమాకి ఒక మెట్టు ఎక్కువ కష్టపడ్డాం. చాలా ప్రొస్థటిక్ వర్క్స్ వున్నాయి. నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చే సినిమా అని టీం అందరికీ చెప్పాను. సినిమా చాలా ప్యాక్డ్ గా వచ్చింది. ప్యాక్డ్ గా వున్న థియేటర్స్ లో చూడండి పిచ్చెక్కిపోతుంది. ఇది నా ప్రామిస్. తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల మేం గెలుస్తూ ఉంటాం. ఎన్నో విజయాలు అందించారు. ఈసారి మిమ్మల్ని నేను గెలిపించాలనుకుంటున్నా. దాని కోసం ఎంతో కష్టపడ్డాం. నిజంగా మీకు సినిమా నచ్చితే సినిమా పూర్తయిన తర్వాత రెండు చప్పట్లు కొట్టండి. అంతకంటే ఎక్కువ ఆశించడం లేదు. అలాంటి చప్పట్ల నుంచి ఇన్స్ ఫైరై ఇక్కడిదాక వచ్చాను. ఈ సినిమాలో కథతో పాటు అద్భుతమైన కామెడీ,. ప్యూర్ ఎమోషన్ వుంటుంది. చాలా రోజుల పాటు ఇంపాక్ట్ వుండిపోయే సినిమా.
సినిమా చూసిన తర్వాత మీ పేరెంట్స్ కి ఫోన్ చేస్తారు. మీరే వాళ్ళని సినిమాకి తీసుకెళతారు. సినిమాని ఎవరూ మిస్ అవ్వరని నమ్ముతున్నాను. సునీల్ గారు రవిబాబు గారు, గోపరాజు గారు అందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. నేను చేసిన పాత్రలు కూడా చాలా బావొచ్చాయి. రీతుతో పదేళ్ళ తర్వాత వర్క్ చేస్తున్నా, తను మంచి స్టొరీలు సెలెక్ట్ చేస్తుంటుంది. చాలా మంచి పెర్ఫార్మర్. దక్ష చాలా బాగాపెర్ఫారమ్ చేసింది. మీరా జాస్మిన్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్. ఈ సినిమాతో కూడా నేషనల్ అవార్డ్ వస్తుంది. ఆవిడకి వస్తుందో సినిమాకి వస్తుందో చూద్దాం(నవ్వుతూ). శరణ్య గారిది గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అక్టోబర్ 4న థియేటర్స్ కి వచ్చి మీరు గెలిచి నన్ను గెలిపిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ’ అన్నారు.
Swag Trailer: శ్రీ విష్ణు ‘శ్వాగ్’ ట్రైలర్ రిలీజ్
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రతి సినిమాకి ఒక కమర్షియల్ మీటర్, స్పాన్ వుంటుంది. ఒకొక్కసారి కంటెంట్ వున్నప్పుడు, మార్కెట్ కి మించిన స్పాన్ వున్నప్పుడు చేసే సినిమాలు కొన్ని వుంటాయి. అలా చేసిన వాటిలో మాకు గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ2 చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. శ్వాగ్ కూడా లాంటి కేటగిరీలోకే వస్తుంది. అలాంటి సక్సెస్ వస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు గారిని కమల్ హాసన్ గారితో పోల్చడం అనేది ధైర్యంగా చెప్పొచ్చని భావిస్తున్నాను. ఇందులో శ్రీవిష్ణు చేసిన క్యారెక్టర్స్ దేనికవి యూనిక్ గా వుంటాయి. ప్రతి పాత్రకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. హసిత్ అద్భుతంగా తీశాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. అక్టోబర్ 4న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు.
హీరోయిన్ రీతు వర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శ్వాగ్ లాంటి మంచి కథని నమ్మి సినిమాని నిర్మించిన మా నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. పీపుల్ మీడియా ఫాక్టరీలో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా నా గత సినిమాలకి చాలా డిఫరెంట్ గా వుంటుంది. నా క్యారెక్టర్స్ కొత్తగా వుంటుంది, నన్ను నమ్మిన మా డైరెక్టర్ హసిత్ కి థాంక్ యూ. విష్ణు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తన హార్డ్ వర్క్ చూసి చాలా ఇన్స్ పైర్ అయ్యారు. విష్ణు, హసిత్ తో కలసి వర్క్ చేయడం ప్రతి రోజు మెమరబుల్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. పెళ్లి చూపుల తర్వాత వివేక్ సాగర్ తో నా సెకండ్ కొలాబరేషన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అక్టోబర్ 4న థియేటర్స్ కి వస్తుంది. అందరూ చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.’ అన్నారు.
మూవీ డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ… శ్రీ విష్ణు, వివేక్ నాకు గురు సమానులు. వాళ్ల సపోర్ట్ తోనే ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్నాను. కథను నమ్మి సినిమాని చేసే ప్రొడ్యూసర్ విష్ణు ప్రసాద్ గారు. రాజరాజ తర్వాత సెకండ్ ఫిల్మ్ వారి నిర్మాణంలోనే చేయడం చాలా ఆనందంగా ఉంది. విశ్వ గారు గడ్సీ ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్ చేశారు. సినిమాకి కావాల్సింది ఎక్కడ రాజీ పడకుండా సమకూర్చారు. కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు. ఆయన హీరో అవ్వాలని ఏ సినిమా చేయలేదు. కథ హీరో అవ్వాలని చేశారు. ఆయన కథానాయకుడిగా చేస్తున్నారు. అక్టోబర్ 4న బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ మూవీని చూడబోతున్నారు. చాలా ఆత్మవిశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను. రీతు గారు చాలా స్ట్రాంగ్ రోల్ చేస్తున్నారు. ఎఫర్ట్ లెస్ గా చేశారు. మీరా జాస్మిన్ గారు మరో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు. దక్ష గారు చాలా జెన్యూన్ పర్సన్. శరణ్య గారు ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నా టెక్నికల్ టీం డైరెక్షన్ టీం కి థాంక్యూ. వివేక్ సాగర్ మ్యూజిక్ దద్దరిల్లుతుంది. వేదరామన్ అద్భుతమైన విజువల్స్ ని ఇచ్చాడు. ఎడిటర్ విప్లవ్ కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. రషీద్ గారు చాలా అద్భుతమైన ప్రోస్థటిక్ వర్క్ చేశారు. శ్రీ విష్ణు గారు నాలుగు క్యారెక్టర్స్ లో బ్రిలియంట్ గా యాక్ట్ చేశారు. అందరి దగ్గరికి సినిమా వస్తోంది. దసరా అయిపోయిన తర్వాత కూడా ఇంకా చూస్తూనే వుంటారనేది నా నమ్మకం. అక్టోబర్ 4న కలుద్దాం’ అన్నారు.
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ… రాజరాజ చోరా సినిమా జరుగుతున్నప్పుడే మంచి విజయం సాధిస్తుందని విశ్వ గారికి చెప్పాను. స్వాగ్ సినిమా కూడా చాలా మంచి హిట్ కొట్టబోతుంది. శ్రీ విష్ణు తనని తాను రీ ఇన్వెంట్ చేసుకుంటున్న విధానం భావితరాలకు స్ఫూర్తి ఇస్తుందని నమ్ముతున్నాను. మెంటల్ మదిలో తర్వాత నేను రొమాంటిక్ కామెడీ సినిమాలే తీయగలని అంతా అనుకున్నారు. బ్రోచేవారెవరురా తీసానంటే దానికి కారణం శ్రీ విష్ణు. తనే నన్ను బలంగా నమ్మారు. రీతు రెండు రోల్స్ లో చాలా అద్భుతంగా చేసింది. హసిత్ టీం అంటే నాటిమే. మేమంతా కలిసే జర్నీ స్టార్ట్ చేశాం. హసిత్ ది వెరైటీ మైండ్. ఇంత స్కేలున్న ప్రాజెక్ట్ ని తను హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సినిమా చాలా బాగుందని చాలా మంది చెప్తున్నారు. ఒక నాలుగు జనరేషన్ కథని చాలెంజ్ గా తీసుకొని చెప్పాడు. ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అందరికీ ముందుగా కంగ్రాజులేషన్స్’ చెప్పారు
Swag Movie: శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుంచి నాస్టాల్జిక్ మెలోడీ నీలో నాలో సాంగ్ రిలీజ్
హీరోయిన్ దక్ష మాట్లాడుతూ..అందరికి నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్యూ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ హసిత్ గారికి థాంక్ యూ. శ్రీ విష్ణు గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాతో రీతు చాలా మంచి ఫ్రెండ్ అయింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్యు. నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శ్రీ విష్ణు గారు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. స్వాగ్ లో ఆయన గెటప్స్ చాలా బావున్నాయి. ఈ సినిమా మరో హిట్ కావాలని, రాజ రాజ చోర తర్వాత హసిత్ గోలి మరో సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. రీతూ వర్మ, దక్షకి ఆల్ ది బెస్ట్. వరుస సినిమాలు చేస్తున్న విశ్వప్రసాద్ గారికి కంగ్రాట్స్. ఈ సినిమా మరో హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
Swag Movie: శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఇంగ్లాండు రాణి సాంగ్ రిలీజ్
యాక్టర్ శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గారిని మెచ్చుకోవాలి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క వేరియేషన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి చేసిన సినిమా ఇది. అక్టోబర్ 4 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాలో నన్ను ఎంపిక చేసిన డైరెక్టర్ హర్షిత్ గారికి థాంక్యూ. ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకి థాంక్. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు
ఎడిటర్ విప్లవ్ నైషధం మాట్లాడుతూ.. ఈ సినిమా మా అందరి కెరీర్లో చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఇది శ్రీ విష్ణు గారి కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుందని నమ్మకం ఉంది. స్వాగంటే.. హసిత్. హి ఈజ్ ఏ వన్ మాన్ ఆర్మీ. రాత తీత కోత వరకు తను వున్నాడు. శ్రీ విష్ణు గారు ఇందులో చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఇలాంటి క్యారెక్టర్ లో శ్రీ విష్ణు గారిని ఎప్పుడు చూసి ఉండరు. రీతు గారు, మీరా గారు, ఎవ్రీ యాక్టర్ అద్భుతంగా చేశారు. వివేక్ సాగర్ ఈ సినిమాకి యాప్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది చాలా గ్రాండ్ స్కేల్ మూవీ. అక్టోబర్ 4న సినిమా వస్తుంది. మీ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలు కి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.