గోపీచంద్ ‘భీమా’ దీపావళి స్పెషల్ పోస్టర్ విడుదల

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ హై-బడ్జెట్ చిత్రం నుంచి గోపీచంద్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు మేకర్స్. ఖాకీ దుస్తుల్లో షేడ్స్‌తో కనిపించారు గోపీచంద్. పోలీసు జీపు బానెట్‌పై కూర్చున్న గోపీచంద్ గూండాలను తాళ్లతో లాగుతున్నారు. పోలీసు ఆఫీసర్ గెటప్‌లో డ్యాషింగ్ గా కనిపిస్తున్నారు గోపీచంద్.

ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన మ్యాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల పనిచేస్తున్నారు.

స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్ కాగా, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. హై యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు

తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె గౌడ
సంగీత దర్శకుడు: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
ఎడిటర్: తమ్మిరాజు
ఆన్‌లైన్ ఎడిటర్: కిరణ్
డైలాగ్స్: అజ్జు మహంకాళి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంక, డాక్టర్ రవివర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్