మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ గా ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో మాస్ క దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. వారణాసిలో ‘గామి’ షూటింగ్ చేస్తున్నపుడు ఫోన్ లో ఫలక్ నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడిని. దర్శకుడు విద్యాధర్ గామి కోసం చాలా రిసెర్చ్ చేశాడు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి చాలా లోతుగా రాసుకున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సమయం పడుతుందని తెలుసు. దాదాపు నాలుగున్నరెళ్ళు పాటు చేశాం. ఇంత సమయం ఇచ్చాము కాబట్టే మంచి సీజీని రాబట్టుకున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే అవేమీ గుర్తు లేవు. అయితే నిజంగానే కుంభమేళాలో ఒకరిద్దరు నేను అఘోర అనుకోని ధర్మం చేశారు. వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూలకూర్చున్నప్పుడు ఓ మూసలామె భోజనం పెట్టి టీ ఇచ్చింది. సినిమా ట్రైలర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ గా వుంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందనే నమ్మకం వుంది. గామి మార్చి 8న విడుదలౌతుంది. ఖచ్చితంగా అందరినీ సరికొత్తగా అలరిస్తుంది’’ అన్నారు
దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ.. అతని అతిపెద్ద భయం మానవ స్పర్శే. అతని లోతైన కోరిక మానవ స్పర్శే. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కుంటున్న అఘోర శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం, దీనితో పాటు సమాంతరంగా కొన్ని పాత్రలు నడుస్తుంటాయి. వాటి ప్రయాణం ఘోర ప్రయాణంతో ఎలా ముడిపడి వుంది, చివరగా అఘోర తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది గామి కథాంశం. ఆడియన్స్ కి ఇప్పటివరకూ ఇవ్వని కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. ఈ సినిమా విజువల్స్ ని రాబట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. విశ్వక్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఏది అడిగితే అది చేశారు. ఈ సినిమా కోసం కుంభామేళని క్యాప్చర్ చేశాం. మైనస్40డిగ్రీల వద్ద కూడా గ్లౌజులు లేకుండా నటించాడు. నిజమైన మంచులో పేరుకుపోయి చేసిన సన్నివేశాలు చాలా వున్నాయి. అవన్నీ మార్చి 8న చూడబోతున్నారు. ఇప్పటివరకూ ప్రేక్షకులు పొందని అనుభూతిని పొందుతారని కోరుకుంటున్నాం’’ అన్నారు
నిర్మాత కార్తీక్ శబరీష్ మాట్లాడుతూ.. 2018లో ఈ సినిమాని మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ మోడల్ లో ‘మను’ సినిమా సక్సెస్ ఫుల్ గా చేశాం. అదే మోడల్ ని ముందుకు తీసుకువెళ్లాలని ‘గామి’ చేశాం. గామి చాలా ఎక్సయిటింగ్ కంటెంట్. ప్రేక్షకులకు తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు.
ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.
తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, M G అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్
సాంకేతిక విభాగం:-
దర్శకత్వం:- విద్యాధర్ కాగిత
నిర్మాత:- కార్తీక్ శబరీష్
సమర్పణ:- వి సెల్యులాయిడ్
స్క్రీన్ ప్లే:- విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం
ప్రొడక్షన్ డిజైన్:- ప్రవల్య దుడ్డుపూడి
ఎడిటర్:- రాఘవేంద్ర తిరున్
సంగీతం:- నరేష్ కుమారన్
డీవోపీ:- విశ్వనాథ్ రెడ్డి
కో-డిఓపి:- రాంపీ నందిగాం
Vfx సూపర్‌వైజర్:- సునీల్ రాజు చింత
కాస్ట్యూమ్ డిజైన్:- అనూష పుంజాల, రేఖ బొగ్గరపు
కలరిస్ట్:- విష్ణు వర్ధన్ కె
సౌండ్ డిజైన్: – సింక్ సినిమాస్
యాక్షన్ కొరియోగ్రాఫర్:- వింగ్ చున్ అంజి
పాటలు:- నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
సాహిత్యం:- సనాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ మణి
పీఆర్వో:- వంశీ-శేఖర్
మార్కెటింగ్:- ఫస్ట్ షో