50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్ రీచ్ అయిన‌ జీ5 ఒరిజిన‌ల్ “ATM”

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠి, గుజ‌రాతి, బెంగాళి స‌హా ప‌లు భాష‌ల్లో ఆడియెన్స్‌కు వైవిధ్య‌మైన కంటెంట్ అందిస్తోంది జీ 5. ఇంత కంటెంట్‌ను మ‌రో డిజిట‌ల్ మాధ్య‌మం అందించ‌టం లేదంటే అతిశ‌యోక్తి కాదు. జాతీయ స్థాయిలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న జీ 5 ఓ ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఫీచర్ ఫిల్మ్స్ విష‌యానికి వ‌స్తే.. RRR (రౌద్రం ర‌ణం రుధిరం) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను అందించింది జీ5. అలాగే దీంతో పాటు ఎన్నో తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తంఓది. మ‌రో వైపు పింక్ ఎలిఫెంట్ రూపొందించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి.. అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి లూజ‌ర్ 2.. బీబీసీ స్టూడియోస్‌, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ కాంబినేష‌న్‌లో రూపొందిన రేసీ వంటి చిత్రాల‌తో పాటు మా నీళ్ల ట్యాంక్‌, పేప‌ర్ రాకెట్‌, హ‌లో వ‌ర‌ల్డ్ సినిమాల‌ను స్ట్రీమింగ్ చేసింది. తాజాగా తెలుగు వెబ్ సిరీస్ ATM స్ట్రీమింగ్ చేసింది.

జీ 5 ఇత‌ర ఒరిజిన‌ల్స్ త‌ర‌హాలోనే ATM ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుని అతి పెద్ద హిట్ అయ్యింది. ఈ సిరీస్ ఇప్ప‌టి వ‌ర‌కు 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రీచ్ కావట‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్రేక్ష‌కులు ఈ సిరీస్‌లో ప్ర‌తి ఎపిసోడ్‌ను ఎంత‌గానో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగాసుబ్బ‌రాజు పాత్ర మూడో ఎపిసోడ్ నుంచి ఎంట్రీ ఇస్తుంది. అప్ప‌టి ఈ సిరీస్‌ను ఆడియెన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సిరీస్ క్లైమాక్స్ ప్రేక్ష‌కులకు చేతి వేళ్ల గొర్ల‌ను కొరికేసుకునేంత‌టెన్షన్ ఉన్న థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను అందిస్తుంది.

ATMకి కొన‌సాగింపుగా ATM2 ఎప్పుడు రానుందా అనే ఆస‌క్తిని ద‌ర్శ‌కుడు సి.చంద్ర మోహ‌న్, రైటింగ్ డిపార్ట్‌మెంట్ క్రియేట్ చేసిన ప్ర‌శంస‌ల‌ను అందుకుంటుంది. ఈ సిరీస్‌లో మ‌న‌కు తెలియ‌ని ఆ ఐద‌వ క్యారెక్ట‌ర్ ఎవ‌రా అనే ఆస‌క్తిని అంద‌రిలోనూ క‌లిగింది. చివ‌ర్లో ఆ పాత్ర ఎంట్రీ అనేది ఆడియెన్స్ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచేసింది. రీసెంట్‌గా వ‌చ్చిన వెబ్ సిరీస్ అన్నింటిలోనూ ATMకి బెస్ట్ క్లైమాక్స్ కుదిరింద‌ని చూసిన వారంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి త‌న పెన్ ప‌వ‌ర్ చూపించారు. త‌న మార్క్ స్టైల్‌, ఆలోచ‌న‌ల‌ను మిక్స్ చేసి ఆక‌ట్టుకున్నారు. వి.జె.స‌న్ని, సుబ్బ‌రాజు స‌హా ఇత‌ర పాత్ర‌ధారులు.. ఆ పాత్ర‌ల్లోని రా రెస్ అంద‌రిల్లో థ్రిల్ల్‌నెస్ పీక్స్‌కి తీసుకెళ్లింది. సిరీస్‌ను ప్ర‌శాంత్ ఆర్‌.విహారి బ్యాగ్రౌండ్ స్కోర్‌, మోనిక్ విజువ‌ల్స్ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి… ఆడియెన్స్‌తో అప్రిషియేష‌న్స్ ర‌ప్పించేలా చేస్తున్నాయి.

న‌టీన‌టులు:
జగన్‌గా వీజే స‌న్ని, హెగ్డేగా సుబ్బ‌రాజ్‌, గ‌జేంద్ర‌గా పృథ్వీ, కార్తీక్‌గా కృష్ణ బూరుగుల‌, అభ‌య్‌గా ర‌విరాజ్‌, హ‌ర్ష‌గా రాయ‌ల్ శ్రీ, ర‌మ్యా నాయ‌క్‌గా దివి, సీఐ ఉమాదేవిగా దివ్యవాణి, మెంట‌ర్ పాత్ర‌లో ష‌ఫీ, నీలోఫ‌ర్‌గా హ‌ర్షిణి న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం:
ప్రొడ‌క్ష‌న్‌: దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌,
క‌థ‌, ర‌చ‌న‌: హరీష్ శంక‌ర్‌,
స‌మ‌ర్ప‌ణ‌: శిరీష్‌, హ‌రీష్ శంక‌ర్‌,
నిర్మాత‌లు: హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌,
ద‌ర్శ‌క‌త్వం: సి.చంద్ర‌మోహ‌న్‌,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అకుల్ ఎన్‌,
సి.ఇ.ఒ: మెహ‌ర్ కిలారు,
కో డైరెక్ట‌ర్‌: కృష్ణ శంక‌ర్ చింత‌,
స్క్రీన్ ప్లే: సి.చంద్ర‌మోహ‌న్‌,
అడిష‌న‌ల్ స్క్రీన్ ప్లే: ఫ‌ణి,
మ్యూజిక్‌: ప్ర‌శాంత్ ఆర్‌.విహారి,
క్రియేట‌ర్‌: హ‌రీష్ శంక‌ర్‌.ఎస్‌,
డైలాగ్స్‌: విజ‌య్ ముత్యం, సి.పి.ఇమ్మాన్యుయేల్‌,
ఎడిట‌ర్‌: అశ్విన్‌.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫీ: మౌనిక్ కుమార్‌.జి,
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: శ్రీనివాస్ పున్న
కోడైరెక్ట‌ర్‌: కృష్ణ శంక‌ర్ చింత‌ ,
కాస్ట్యూమ్స్‌: శ్రీనివాస్,
కాస్టింగ్‌: పుష్ప భాస్క‌ర్‌,
పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర – ఫణి).