సోనీ లివ్‌లో గ్రాండ్ సక్సెస్ అయిన మాస్టర్ చెఫ్ ఇండియా హిందీ రియాల్టీ షో ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి రాబోతోంది. మాస్టర్ చెఫ్ ఇండియా తమిళ, మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగు అనే పేర్లతో ఈ షో తమిళ, తెలుగు భాషల్లోకి రాబోతోంది. తమిళ షోలో కౌశిక్ శంకర్, శ్రీయా అడ్కా, రాకేష్ రఘునాథన్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు షోలో చెఫ్ సంజయ్ తుమ్మా, నిఖిత ఉమేజ్, చెఫ్ చలపతి రావులు జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు.
దక్షిణాది వారి అభిరుచికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ప్రతీ ప్రాంతానికి, భాషకు, రాష్ట్రానికి ప్రత్యేక సంప్రదాయం, ఆచారాలున్నాయి. వాటిని ప్రతిబింబించేలా ఈ షోను డిజైన్ చేశారు. కొత్తగా ప్రారంభిస్తోన్న ఈ కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సారి పోటీ దేశ వ్యాప్తంగా ఉన్న మాస్టర్ చెఫ్‌ల ఉండబోతోంది. ఈ సారి షో మరింత రసవత్తరంగా ఉండబోతోంది.
సోనీ లివ్ హెడ్ కంటెంట్ సౌగాట ముఖర్జీ మాట్లాడుతూ ..భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయం. ఇండియాలో ప్రాంతీయ భాషల్లో మా ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అందులో భాగంగా తమిళ, తెలుగు భాషల్లో మాస్టర్ చెఫ్ ఇండియా షో రాబోతోంది. ఈ కార్యక్రమం వల్ల దక్షిణాది రుచుల్ని కూడా దేశానికి చూపించే అవకాశం కలుగుతుంది.. అన్నారు.
సోనీ లివ్ గురించి..
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (ఎస్ పీ ఎన్ ఐ)లో భాగమే ఈ సోనీ లీవ్ ఓటీటీ ఫ్లాట్ ఫాం. అన్ని రకాల డివైస్‌లో ఈ సోనీ లీవ్ అందుబాటులో ఉంది. ఎస్ పీ ఎన్ ఐలోని 27 ఏళ్ల కంటెంట్‌ను సోనీ లీవ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నలభై వేల గంటల ప్రోగ్రాంలు ఉన్నాయి. హాలీవుడ్ షోలు, టీవీ షోలు, లైవ్ టీవీలు ఇలా ఎన్నెన్నో సోనీ లీవ్ సబ్ స్క్రైబర్లకు అందుబాటులోనే ఉన్నాయి. వంద మిలియన్లకు సోనీ లీవ్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. హిందీ, మరాఠీ, తమిళ్, మలయాళం, తెలుగు ఇలా ఎన్నో భాషల్లో సోనీ లీవ్ ఎంతో గొప్ప కంటెంట్‌ను సృష్టించింది. రాకేట్ బాయ్స్, గుల్లాక్, స్కామ్ 1992 ది హర్షద్ మెహతా స్టోరీ, మహారాని, అవరోధ్, కాలేజ్ రొమాన్స్, అందేఖీ, యువర్ హానర్, ఇరు దురువం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సిరీస్‌లను అందించింది.
లైవ్ క్రికెట్, ఫుల్ బాల్, టెన్నిస్, బాస్కెట్ బాల్, రేసింగ్, ఫైట్ స్పోర్ట్స్ అంటూ ఇలా ఎన్నో ప్రోగ్రాంలతో ఏడాది అంతా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, రోనాల్డ్ గారోస్, ది యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, డేవిస్ కప్, డబ్ల్యూ డబ్ల్యూఈ, ఎఫ్ ఏ కప్, అల్టీమేటింగ్ ఫైటింగ్ చాంపియన్ షిప్, యూఈఎఫ్ ఏ యూరోప్ లీగ్, ఆ యాషెస్, ఏటీపీ 1000 మాస్టర్స్ టోర్నమెంట్స్, రోష్న్ సౌది ప్రో లీగ్ వంటి ఎన్నో ఆటలను అందిస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, శ్రీలంక క్రికెట్, ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ హక్కులను కూడా సోనీ లీవ్ సొంతం చేసుకుంది.
ఎస్‌పీఈ ఫిల్మ్, ఐ టీవీ వంటి సంస్థలతోనూ సోనీ లీవ్‌కు ఒప్పందాలున్నాయి. ది గుడ్ డాక్టర్స్ సీజన్ 6, అక్యూజ్డ్, లక్కీ హంక్, ఏ డిస్కవరీ ఆఫ్ విచెస్ వంటివెన్నో వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఆస్కార్ అవార్డులు పొందిన ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్, ది వేల్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. రెసిడెంట్ ఈవిల్ వెల్కమ్ టు ది రక్కూన్ సిటీ, ఘోస్ట్ బస్టర్ ఆఫ్టర్ లైఫ్ వంటివెన్నో హాలీవుడ్ సినిమాలున్నాయి.