వాలంటైన్స్ డే కానుక‌గా ల‌వ్‌స్టోరి ఉషా ప‌రిణయం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. వాలంటైన్స్ డే సంద‌ర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్ పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ‌కు విదేశాల‌కు వెళుతున్నాన‌మ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

నటీనటులు: శ్రీ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ, వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌, ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత : కె.విజ‌య్‌భాస్క‌ర్