ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. గత ఏడాది విడుదలైన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని.. బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. అత్యద్భుతమైన విజువల్స్‌తో లార్జర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మణిరత్నం సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో `పొన్నియిన్ సెల్వన్ 2` విడుదలవుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో..
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మణిరత్నంగారు డైరెక్ట్ చేసిన చిత్రాల్లో నాకు గీతాంజలి చాలా ఇష్టమైన సినిమా. ఆయన దర్శకత్వం వహించిన అమృత సినిమాతో నేను సినీ రంగంలో నా జర్నీని స్టార్ట్ చేశాను. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1ను తెలుగు రాష్ట్రాల్లో మా బ్యానర్ విడుదల చేసింది. చాలా గ్రేట్ సక్సెస్ అందుకున్నాం. ఇప్పుడు పీఎస్ 2 (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2) కూడా మా బ్యానర్‌లోనే రిలీజ్ చేస్తున్నాం. మణిరత్నంగారు, సుభాస్కరన్ వంటి లెజెండ్రీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి చేసిన సినిమా ఇది. విక్రమ్‌గారు, కార్తీగారు, జయం రవిగారు, ఐశ్వర్య రాయ్‌గారు, త్రిషగారు ఇంకా చాలా మంది మల్టీస్టారర్ మూవీ ఇది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎ.ఆర్.రెహమాన్‌గారు సంగీతం అందించిన పీఎస్ 2 మ్యూజికల్‌గానూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు.
హీరో జయం రవి మాట్లాడుతూ ‘‘ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆడియెన్స్ ఇచ్చే రెస్పాన్స్‌కి వందసార్లు సలాం కొట్టినా తక్కువే. నేను పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఇందిరానగర్‌లో నాకు ఇల్లు ఉంది. అప్పటి హైదరాబాద్‌కి ఇప్పటి హైదరాబాద్‌కి చాలా తేడా ఉంది. కానీ ఆడియెన్స్ మాత్రం అస్సలు మారలేదు. సేమ్ ఎనర్జీ, ప్యాషన్ కనిపిస్తుంది. పీఎస్ 2 సినిమాతో మేం అందరికీ ధన్యవాదాలు చెప్పడానికే ఇక్కడకు వచ్చాం. దీన్ని కూడా పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాం. మణిరత్నంగారికి గుండె ధైర్యం చాలా ఎక్కువ. అందుకనే ఆయన రెండు పార్టులను ఒకేసారి చేసి ఆరు నెలల గ్యాప్‌లో రిలీజ్ చేశారు. ఇక సుభాస్కరన్ గారి గుండె ధైర్యం గురించి చెప్పాలంటే.. పొన్నియిన్ సెల్వన్ సినిమా చేయటానికి ఎంజీఆర్‌గారి నుంచి ట్రై చేస్తున్నారు. కుదరలేదు. మీరు కూడా ట్రై చేయవద్దని అన్నప్పటికీ .. ఆయన ఏకంగా రెండు పార్టులను నిర్మించారు’’ అన్నారు. నేను ఐశ్వర్యారాయ్‌కి పెద్ద అభిమానిని. విక్రమ్ అన్నకు లవ్ యు. ప్రతి ఒక్కరికీ కార్తి లాంటి స్నేహితుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను లేకపోతే ఈ సినిమా నేను చేయటం కష్టమయ్యేది. త్రిష సిస్టర్‌కి థాంక్స్. తెలుగమ్మాయి శోభిత, ఐశ్వర్య లక్ష్మి సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.
ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ ‘‘పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 28న మీ అందరినీ థియేటర్స్‌లో కలుస్తాం. మణిరత్నంగారికి థాంక్స్. ఆయనతో ఇరువర్ నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఉంది. చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా మంది టీమ్‌తో పని చేసే అదృష్టం కలిగింది. నిర్మాత సుభాస్కరన్‌గారు అందించిన తిరుగులేని సపోర్ట్‌తో గొప్ప మ్యాజికల్ ప్రంచాన్ని క్రియేట్ చేయగలిగాం. గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసే అవకాశం కలిగింది. చాలా కష్టపడి చేశాం. ప్రతి క్షణాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ ‘‘పీఎస్1కి ఇచ్చిన రెస్పాన్స్‌కి థాంక్స్. ఇప్పుడు పీఎస్ 2 రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ ఎనర్జీ, ప్యాషన్ మామూలుగా ఉండదు. దీన్ని కూడా పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
శోభితా దూళిపాళ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు నటించిన నటీనటులకు, సాంకేతికి నిపుణులకు థాంక్స్. ఈ సినిమా మాకెంతో స్పెషల్. మణి రత్నంగారికి థాంక్స్. ఏప్రిల్ 28న మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు.
సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకుల మాకు ఇస్తున్న సపోర్ట్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మణిరత్నంగారికి, సుభాస్కరన్‌గారికి, దిల్ రాజుగారు కలిసి ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్‌కు అందిస్తున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
త్రిష మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు అందించే సపోర్ట్ ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. మా పీఎస్ 2 సినిమా ఏప్రిల్ 28న థియేటర్స్‌లోకి రానుంది. మా సహా నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. ఈ సినిమా కోసం మా జర్నీ మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. మణిరత్నంగారు, సుభాస్కరన్‌గారికి థాంక్స్’’ అన్నారు.
హీరో కార్తి మాట్లాడుతూ ‘‘మనం అందరం కాలేజీలో చదువుకుని బయటకు వచ్చేటప్పుడు జరిగే ఫేర్ వెల్ పార్టీ సమయంలో మన లైఫ్‌లో గోల్డెన్ టైమ్ అంటే ఇదేరా! అనిపిస్తుంది. అలాగే మా సినీ కెరీర్ పరంగా ఈ మూవీ మా అందరికీ గోల్డెన్ మూమెంట్స్. ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. ఇక్కడ దొరికే ఫ్రెండ్స్ నా లైఫ్ అంతా ట్రావెల్ అవుతున్నారు. విక్రమ్‌గారిని చూస్తే.. ఎలా వర్క్ చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాను. ఎంత అలసిపోయినప్పటికీ షాట్ రెడీ అంటే డబుల్ ఎనర్జీతో వస్తారు. ఇక జయం రవి మంచి స్నేహితుడు. సెట్స్‌లో అందరినీ నవ్విస్తుంటాడు. త్రిష, లక్ష్మీ, శోభితలకు థాంక్స్. అందరం బాగా కష్టపడ్డాం. ఇంత గొప్ప సినిమాను చేసిన సుభాస్కరన్‌గారికి థాంక్స్. మణిరత్నంగారు నా గురువుగారు. ఆయన ఆశీర్వాదంతో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆయన చూపించే ప్రేమాభిమానాలకు థాంక్స్. రెండు భాగాలను కలిపి షూట్ చేశాం. పీఎస్ 1 ఎంటర్‌టైన్మెంట్ అంటే పీఎస్ 2 క్లాసిక్ మూవీ. మణి రత్నంగారి మూవీ ఎలా ఉంటుందో నాకంటే ఇక్కడి ప్రేక్షకులకే తెలుసు’’ అన్నారు.
చియాన్ విక్రమ్ మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకుల ఎనర్జీ అమేజింగ్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా ప్రాంతాలకు వెళ్లాం. కానీ ఇక్కడ దొరికే ప్రేమ మరో లెవల్‌లో ఉంటుంది. పీఎస్ 1 తెలుగులో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే ప్రేమను పీఎస్2లోనూ చూపిస్తారనుకుంటున్నాను. సుభాస్కరన్‌గారికి థాంక్స్. ఆయన బ్యానర్‌లో పని చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మణిరత్నగారు జీనియస్. ఆయనతో వంద సినిమాలైనా చేయాలని అనుకుంటాను. ఈ టీమ్‌లో అందరికీ ఎక్కువ సన్నివేశాల్లో నటించకపోయినప్పటికీ అందరితో మంచి స్నేహాన్నిచ్చింది. కార్తి, రవి, త్రిష, ఐశ్వర్య ఇలా అందరితో మంచి అనుబంధం ఏర్పడింది.
ఏస్ డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ ‘‘పొన్నియిన్ సెల్వన్ గురించి చెప్పాలంటే ముందు నిర్మాత సుభాస్కరన్‌గారికే థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లనే ఈ సినిమా చేయటానికి సాధ్యమైంది. అయితే దీన్ని రెండు భాగాలుగా చేయటానికి కారణం రాజమౌళి. అందుకు తనకు థాంక్స్. బాహుబలి చిత్రాన్ని రెండు భాగాల్లో తను తీయకపోయుంటే నేను పొన్నియిన్ సెల్వన్‌ను రెండు భాగాల్లో చిత్రీకరించలేకపోయేవాడిని. ఈ విషయాన్ని రాజమౌళికి కూడా చెప్పాను. తను సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద హిస్టరీని క్రియేట్ చేశాడు. జయం రవి, కార్తి, విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి, తోట తరణి, శ్రీకర్ ప్రసాద్, రెహమాన్ సహా గొప్ప టీమ్‌తో పని చేశాను. వారందరి సపోర్ట్ వల్లనే ఈ సినిమాను గొప్పగా చేయగలిగాను. కచ్చితంగా ఏప్రిల్ 28న థియేటర్స్‌లో పీఎస్ 2ను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.