‘డంకీ’ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోను వీక్షించ‌టానికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏక‌మ‌వుతున్న షారూక్ ఖాన్ ఫ్యాన్స్‌..

ప్రపంచం యావత్తు ‘డంకీ’ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సినిమాపై తమకున్న ప్రేమను వ్యక్తం చేయటానికి ఏ అవ‌కాశాన్ని కూడా విడిచి పెట్ట‌టం లేదు. ఇండియాలోనే కాదు.. ప్ర‌పంచ‌మంత‌టా ఇదే జోరు క‌నిపిస్తోంది. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోను చూడ‌టానికి వారు ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఆర్‌కె ఫ్యాన్ క్ల‌బ్ టీమ్ 100 % ఫ్యాన్స్ షోస్‌ను ఏర్పాటు చేస్తోంది. మ‌న దేశంలో అయితే 240 సిటీస్‌లో ఈ షోస్‌ను వేస్తున్నారు.

ప్రేమ‌, స్నేహం, స్వ‌దేశానికి తిరిగి రావాల‌నుకునే వారి మ‌నో భావాల‌ను క‌ల‌గ‌లిపి ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాని ఓ అద్భుత‌మైన ప్ర‌పంచాన్ని సృష్టించారు. ఈ సినిమా ఫ్యాన్స్ అంద‌రినీ ఒక చోట‌కి చేరుస్తోంది. ఇక ఓవ‌ర్ సీస్‌లో అయితే 50కి పైగా లొకేష‌న్స్‌లో ఫ్యాన్స్ షోస్‌ను వేస్తున్నారు. వీకెండ్ వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 750కిపైగా షోస్‌ను అభిమానుల కోసం ప్ర‌ద‌ర్శించ‌నుండ‌బోవ‌టం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

https://x.com/teamsrkfc/status/1734450209420382710?s=48&t=PusltWkTns46RNMqjWxAeA

డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ప్రారంభ‌మ‌య్యాయో లేదో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. తొలిరోజున యు.ఎస్‌.ఎలో అయితే ఏకంగా 5వేల టికెట్స్ అమ్ముడు కావ‌టం విశేషం. డంకీ డ్రాప్ 1గా వీడియో, డంకీ డ్రాప్ 2గా వ‌చ్చిన లుట్‌పుట్ గ‌యా పాట‌, డంకీ డ్రాప్ 3గా వ‌చ్చిన నిక‌లే ది క‌బీ హ‌మ్ ఘ‌ర్ సే పాట‌, డంకీ డ్రాప్ 4గా రిలీజైన ట్రైల‌ర్‌, డంకీ డ్రాప్ 5 అంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఓ మ‌హా.. అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ .. ఇలా ప్ర‌తి కంటెంట్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఫ్యాన్స్ కూడా త‌మ ప్రేమ‌ను వివిధ రూపాల్లో వ్య‌క్తం చేస్తున్నారు.

డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.