‘డంకీ డ్రాప్ 6’గా రిలీజైన ఎన‌ర్జిటిక్ సాంగ్ ‘బందా’..

కింగ్ ఖాన్ షారూక్‌, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా..అని ఆస‌క్తిగా ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. అంద‌రిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. షారూక్ స‌హా ఎంటైర్ టీమ్ ‘డంకీ’ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం షారూక్ అండ్ టీమ్ గ్లోబ‌ల్ విలేజ్‌గా ప్ర‌సిద్ధికెక్కిన దుబాయ్‌లోని వోక్స్ సినిమాలో నిర్వహించిన గ్రాండ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పాల్గొన్నారు. ల‌క్ష‌కుపైగా అభిమానులు ఈవెంట్‌కు హాజ‌రు కావ‌టం విశేషం.

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌నే కాదు.. అందులో బ‌ల‌మైన ఎమోష‌న్స్‌ను మిక్స్ చేసి హృద‌యాల‌ను హ‌త్తుకునేలా సినిమాల‌ను తెర‌కెక్కించ‌టంలో డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాని స్పెష‌లిస్ట్‌. ఆయ‌న మ‌రోసారి డంకీ చిత్రంతో మ‌రో అంద‌మైన ప్ర‌పంచాన్ని సృష్టించారు. దీన్ని డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షారూక్ ఖాన్ అభిమానులు, ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో డంకీ డ్రాప్ 6 అంటూ ‘బందా..’ అనే సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

‘బందా..’ అనేది ఓ పెప్పీ సాంగ్‌. ఇందులో హార్డి పాత్ర‌లో న‌టించిన షారూక్ ఖాన్ క్యారెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేశారు. దిల్జీత్ దోసంజ్ పాడిన ఈ పాట‌ను కుమార్ రాశారు. ప్రీత‌మ్ సంగీతాన్ని అందించారు. షారూక్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ అంద‌రిలోనూ ఆస‌క్తిని రెట్టింపు చేసింది. ఈ ఆస‌క్తి అడ్వాన్స్ బుకింగ్స్‌లో క‌నిపిస్తుంది. చాలా సినిమాల‌ను ఈ నెంబ‌ర్స్ దాటేస్తూ రికార్డుల‌ను క్రియేట్ చేస్తుండ‌టం విశేషం.

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.

https://x.com/iamsrk/status/1736725619822748119?s=46&t=PusltWkTns46RNMqjWxAeA