‘డంకీ డ్రాప్ 2- లుట్ పుట్ గయా…’ మెలోడి సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, సక్సెస్‌పుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’. బుధవారం ఈ చిత్రం నుంచి ‘డంకీ డ్రాప్ 2’ అంటూ సినిమా నుంచి ‘లుట్ పుట్ గయా..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ సంగీతాభిమానుల హృదయాలను ఈ పాట హత్తుకుంది. ప్రేమలోని స్వచ్చతను తెలియజేసే ఈ పాట కచ్చితంగా మీ ప్లే లిస్టులో స్థానాన్ని కలిగి ఉంటుందనటంలో సందేహం లేదు.

ఆడియెన్స్‌కి తిరుగులేని ట్రీట్‌ని అందించిన ‘లుట్ పుట్ గయా..’ పాట విడుదలైన 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది. దీంతో రాజ్‌కుమార్ హిరాణి రూపొందిస్తోన్న ‘డంకీ’ ప్రపంచంలో ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలు ఉండబోతున్నాయోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు పెరిగాయి.

షారూక్ ఖాన్ పాత్ర ఇంకెలా ఉంటుందోననే ఆసక్తి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కలిగింది. ఇదే ఆసక్తిని వారు #AskSrk సెషన్‌లో కనపరిచారు. లుట్ పుట్ గయా పాటపై తమ ప్రేమను వారు మాటల రూపంలో కింగ్ ఖాన్‌కి తెలియజేశారు.

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.

https://www.instagram.com/reel/Cz-7kTDSt-H/?igshid=MzRlODBiNWFlZA==