‘డంకీ’ ప్రమోషన్స్ కోసం దుబాయ్‌లో షారూక్ సందడి.. హద్దుల్లేని అభిమానుల ఆనందం

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బాద్షా షారూక్ గ్లోబల్ విలేజ్ దుబాయ్‌ని చేరుకున్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దుబాయ్ చేరుకుని డంకీ ప్రమోషన్స్ చేసే క్రమంలో షారూక్ ఖాన్‌కి అక్కడి ప్రజల నుంచి ఘనమైన స్వాగతం లభించింది.

https://x.com/srkuniverse/status/1736440332232081663?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

https://x.com/srkuniverse/status/1736433606422368422?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

దుబాయ్‌లో ‘డంకీ’ ప్రమోషన్స్ చేస్తున్న షారూక్ దుబాయ్ డెయిరా సిటీ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ వి.ఓ.ఎక్స్ సినిమాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కింగ్ ఖాన్‌ని చూసిన ఫ్యాన్స్ తెగ హంగామా చేశారు. బాద్షాకు అద్భుతమైన స్వాగతాన్ని పలికారు. ఈవెంట్‌కి వచ్చిన ప్రజల నినాదాలతో ఆడిటోరియం మారుమోగింది.

https://x.com/srkchennaifc/status/1736410680159510672?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

https://x.com/ind_ram_/status/1736408611507855436?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

బిగ్గెస్ట్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన షారూక్ ఖాన్‌కి గొప్పగా స్వాగతం పలకటానికి దుబాయ్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ విలేజ్ దుబాయ్‌లోని ప్రేక్షకులకు డుంకీ ఫీవర్ పట్టుకుంది. వారు కూడా లుట్ పుట్ గయా.. అంటూ పాడుకుంటున్నారు.

https://x.com/srkuniverse/status/1736406241679986872?s=46&t=PusltWkTns46RNMqjWxAeA

https://x.com/srkuniverse/status/1736407926544441751?s=46&t=

డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.