డాక్టర్ నరేష్ వికె, పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ టీజర్ విడుదల

నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. కన్నడ టైటిల్ మత్తే మధువే. విలక్షణమైన కథతో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తో మంచి ఇంప్రెషన్ తెచ్చిన మేకర్స్ ఈ రోజు రెండు భాషలలో టీజర్‌ను విడుదల చేశారు. వనిత విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను మోసపోయానని చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తన భర్త పాత్ర పోషించిన నరేష్ ని మృగం అని పిలుస్తుంది. రెండవసారి తన ప్రేమను గుర్తించిన నరేష్ , పవిత్ర లోకేష్‌తో సంతోషకరమైన జీవితాన్ని గడపడం కనిపిస్తుంది.

ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్న ద‌ర్శకుడు ఎంఎస్ రాజు మ‌రో విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కించారు. టీజర్ ఆసక్తికరమైన కథనంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నరేష్ తన ఎప్పటిలాగే అత్యుత్తమ నటన కనబరిచారు. పవిత్ర లోకేష్ , వనిత వారి వారి పాత్రలకు పర్ఫెక్ట్ ఛాయిస్.

సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నేపథ్యం పెద్ద ఎస్సెట్. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.

జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.

‘మళ్ళీ పెళ్లి’/ మత్తె మధువే ఈ వేసవిలో విడుదల కానుంది.

తారాగణం: డాక్టర్ నరేష్ వికె, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు

సాంకేతిక విభాగం:
రచన , దర్శకత్వం: ఎంఎస్ రాజు
నిర్మాత: డాక్టర్ నరేష్ వికె
బ్యానర్: విజయ కృష్ణ మూవీస్
సంగీతం: సురేష్ బొబ్బిలి
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అరుల్ దేవ్
డీవోపీ: ఏంఎన్ బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిక్
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
సాహిత్యం: అనంత శ్రీరామ్
పీఆర్వో : వంశీ-శేఖర్

Malli Pelli Telugu Teaser | Dr Naresh V.K , Pavithra Lokesh | M.S.Raju