‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’లా ఆద్యంతం అలరించే కమర్షియల్ చిత్రంగా ‘యుఫోరియా’ ఉంటుంది- సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు గుణ శేఖర్

Euphoria: భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు వైజాగ్‌లో సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐపీఎస్ శంఖ బ్రాతా భక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..

*దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ* .. ‘వైజాగ్ కాలేజీలో చదివాను. ఇక్కడి వీధుల్లో తిరిగాను. ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ఇలా ఇప్పుడు మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ‘యుఫోరియా’ అంటే పట్టలేని ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహం. పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే యుఫోరిక్ మూమెంట్ ఉంటుంది. అలాంటి మూమెంట్‌లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలా మనం కంట్రోల్ చేసుకోలేక అదుపు తప్పితే జీవితం నాశనం అవుతుంది. యుఫోరియా ఎంత సరదాగా ఉంటుందో.. ఆ సరదా తీర్చేలా చిత్రం ఉంటుంది. ఇది కేవలం యూత్ సినిమానే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉంటుంది. పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే పిల్లలు ఎలా చెడిపోతారో చూపించాం. పిల్లలు పెడదారి పడితే సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ మూడు అంశాల చుట్టూనే ఈ ‘యుఫోరియా’ మూవీని తీశాం. అన్ని తరాలకు చెప్పాల్సిన కథ అని నా పిల్లలు, ఫ్యామిలీ ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించారు.

అలా అని ఈ సినిమా ఏ మాత్రం ఉపన్యాసం ఇచ్చినట్టుగా కూడా ఉండదు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’లా ఆద్యంతం అలరించే కమర్షియల్ చిత్రంగా ‘యుఫోరియా’ ఉంటుంది. ఎంటర్టైన్ చేస్తూనే ఓ మెసెజ్ ఇచ్చేలా సినిమాని రూపొందించాం. వైజాగ్ వాళ్లకి మెలోడీ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ‘ఎన్నో వసంతాలు’ అనే పాటను ఇక్కడ రిలీజ్ చేశాం. ఈ పాటకు కిట్టు మంచి సాహిత్యాన్ని, కాళ భైరవ మంచి బాణీని అందించారు. ఈ మూవీ కోసం చాలా వరకు కొత్త వారినే తీసుకు వచ్చాను. విఘ్నేశ్ గవిరెడ్డి, పృథ్వీ అడ్డాల, లిఖిత యలమంచలి ఇలా అందరి గురించి ఆడియెన్స్ కచ్చితంగా మాట్లాడతారు. ‘ధురంధర్’తో విజయం సాధించిన సారా అర్జున్ ఇందులో చైత్ర అనే పాత్రను పోషించారు. మాకు ఇక్కడ ఈవెంట్‌ను నిర్వహించేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. పదేళ్ల క్రితం నేను తీసిన ‘రుద్రమదేవి’కి గంటా శ్రీనివాసరావు సాయం చేశారు. ఇక ఇప్పుడు కూడా ఇలా ఆయన వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు ఇలా అందరితోనూ భూమిక నటించారు. అందుకే అందరి అభిమానులు మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వయసుకు మించి ఓ తల్లి పాత్రను పోషించడం అంటే మామూలు విషయం కాదు. కథ విన్న వెంటనే ఒప్పుకున్న భూమిక గారికి థాంక్స్’ అని అన్నారు.

*ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ* .. ‘విశాఖ జిల్లా నుంచి వెళ్లి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్న వ్యక్తి గుణ శేఖర్. అలాంటి వ్యక్తి తీసిన ‘యుఫోరియా’ నుంచి ‘ఎన్నో వసంతాలు’ అనే పాటను ఇక్కడ లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. ‘బాల రామాయణం’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తీసి జాతీయ అవార్డుని సాధించారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప సినిమాల్ని రూపొందించారు. ‘యుఫోరియా’ అనే సినిమా ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. ఇలాంటి సినిమాలే ఇప్పుడు అవసరం అన్నట్టుగా కనిపిస్తోంది. యూత్‌ను సరైన మార్గంలో పెట్టే ఇలాంటి చిత్రాలు కమర్షియల్‌గా హిట్ అవ్వాలి. మంచి మెసెజ్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

*ఐపీఎస్ శంఖ బ్రాతా భక్షి మాట్లాడుతూ* .. ‘గుణ శేఖర్ లాంటి అద్భుతమైన దర్శకుడు, భూమిక లాంటి గొప్ప నటి వైజాగ్‌కు రావడం, ఇక్కడ సాంగ్ లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. విఘ్నేశ్ అందరికీ స్పూర్తిలా నిలుస్తున్నాడు. ‘యుఫోరియా’ టీజర్, ట్రైలర్ అద్భుతంగా అనిపించాయి. ప్రస్తుతం ఇలాంటి కథలు, సినిమాలే సమాజానికి, యువతకు అవసరం. మత్తు పదార్థాలు వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమా చూపిస్తుంది. ఫిబ్రవరి 6న ఈ మూవీని అందరూ చూసి మార్పు చెందుతారని భావిస్తున్నాను’ అని అన్నారు.

*భూమిక మాట్లాడుతూ* .. ‘మా ‘యుఫోరియా’ ఈవెంట్‌కు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు గారు, మన అందరి ఫేవరేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. మా కోసం ఇక్కడకు వచ్చిన వారందరికీ థాంక్స్. ‘యుఫోరియా’ నా పూర్తి సినీ కెరీర్‌లో టాప్‌లో నిలుస్తుంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. సారా అర్జున్, ఇతర ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. థియేటర్ నుంచి బయటకు వెళ్లే క్షణంలో ఏదో ఒక ఆలోచనతో వెళ్తారు’ అని అన్నారు.

*నీలిమ గుణ మాట్లాడుతూ* .. ‘వైజాగ్‌లో మా ‘యుఫోరియా’ సాంగ్‌ను లాంఛ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. నోవాటెల్ నుంచి చూస్తే ఇక్కడ వాతావరణం చూస్తుంటే సంద్రంలా అనిపించింది. మా ఈవెంట్‌కు అనుమతినిచ్చిన సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్. గంటా శ్రీనివాసరావు పదేళ్ల క్రితం మా ‘రుద్రమదేవి’కి ఎంతో సపోర్ట్ చేశారు. మళ్లీ ఇక్కడకు మాకోసం ఇలా వచ్చినందుకు ఆయనకు థాంక్స్. ఈ మూవీలో నాకు కమిషనర్ పాత్ర అంటేనే చాలా ఇష్టం. భూమిక గారు ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌లా అలానే ఉంటారు. సారా అర్జున్ ‘ధురంధర్’తో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యారు. మళ్లీ ఈ చిత్రంతో సారా అర్జున్ అందరినీ ఆకట్టుకుంటారు. ఫిబ్రవరి 6న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

*నటుడు రోనిత్ మాట్లాడుతూ* .. ‘‘యుఫోరియా’ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. మా లాంటి యంగ్ యాక్టర్స్ ఎందరికో అవకాశం ఇచ్చిన గుణ శేఖర్ గారికి థాంక్స్. ఇంత త్వరగా ఆయనతో పని చేసే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి అవకాశం మరోసారి రాదు. జై గుణ శేఖర్ సర్’ అని అన్నారు.

*నటుడు విఘ్నేశ్ గవిరెడ్డి మాట్లాడుతూ* .. ‘సత్యానంద్ గారి వద్ద నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. వైజాగ్‌లో నాకెన్నో మెమోరీస్ ఉన్నాయి. నా సినిమా ప్రమోషన్స్ కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. ‘యుఫోరియా’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన గుణ శేఖర్ గారికి థాంక్స్. ‘యుఫోరియా’ ఎంటర్టైనింగ్ ఉంటూనే, థ్రిల్ పంచుతూ, మంచి సందేశాన్నిచ్చేలా ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ మా సినిమా కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.

*నటుడు పృథ్వీరాజ్ అడ్డాల మాట్లాడుతూ* .. ‘‘యుఫోరియా’ నుంచి ‘ఎన్నో వసంతాలు’ పాటను వైజాగ్‌లో లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. ఇదొక యూత్ ఫుల్ చిత్రం. ఇందులో విఘ్నేశ్ అద్భుతంగా నటించాడు. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన గుణ శేఖర్ గారికి థాంక్స్. నీలిమ గుణ, యుక్తా గుణ, రాగిణి గుణ లాంటి నిర్మాతలు ఉంటనే ఇలాంటి మంచి చిత్రాలు వస్తాయి’ అని అన్నారు.

*నటి లిఖిత యలమంచలి మాట్లాడుతూ* .. ‘నా మొదటి సినిమానే గుణ శేఖర్ గారితో చేయడం అంటే ఎక్కడో రాసి పెట్టి ఉందేమో. ‘యుఫోరియా’లో నేను అద్భుతమైన పాత్రను పోషించాను. ‘ఎన్నో వసంతాలు’ పాటను వైజాగ్‌లో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 6న మా చిత్రం రాబోతోంది. అన్ని పాటలు కూడా ఓ వైబ్‌లో ఉంటాయి. సినిమా కూడా అలానే ఓ వైబ్‌లో ఉంటుంది. ఇందులో నటించిన కొత్త వారైనా మేమంతా తెలుగు వాళ్లమే. సినిమాని చూసి మా అందరినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

బుడబుక్కల పవన్ || Rachamallu Siva Prasad Reddy Fires On Pawan Kalyan Over Tirumala Laddu Issue || TR