ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ నుంచి పవర్ ఫుల్ ‘ఘోర హర’ పాట విడుదల

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కెప్టెన్ మిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం థర్డ్ సింగిల్ ‘ఘోర హర’ పాటని విడుదల చేశారు.

సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం పవర్ ప్యాక్డ్ నెంబర్ ని స్కోర్ చేశారు. రాకేందు మౌళి రాసిన ఇంటెన్స్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని హై ఎనర్జీ వోకల్స్ తో ఆలపించారు. పాటలో వింటేజ్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. ధనుష్ , శివ రాజ్ కుమార్ ల ప్రజెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ పాటలో ధనుష్ , శివ రాజ్ కుమార్ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది.

1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.

ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. టి రామలింగం ప్రొడక్షన్ డిజైనర్. బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. నాగూరన్ ఎడిటర్.

‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 12న ఏకకాలంలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: ధనుష్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్
సమర్పణ: T.G. త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సిద్ధార్థ నుని
ఎడిటింగ్: నాగూరన్
ఆర్ట్: టి.రామలింగం
పీఆర్వో: వంశీ-శేఖర్