Mr Karthik Rerelease: ధనుష్ “మిస్టర్ కార్తీక్” జులై 28న రీ రిలీజ్ !!!!

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రీచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన చిత్రం మయక్కమ్ ఎన్న. తెలుగులో ఈ చిత్రం మిస్టర్ కార్తీక్ గా 2016 లో విడుదలై రొమాంటిక్ లవ్ స్టోరీగా మంచి విజయం సాధించింది. జివి. ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ కార్తీక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. జులై 28న ఈ చిత్రాన్ని భారీగా థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు.

దర్శకుడు శ్రీ రాఘవ కొన్ని హృదయానికి దగ్గరగా ఉండే సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు, అలా ఈ మిస్టర్ కార్తీక్ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే అనేక ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇటీవల తమిళంలో ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇదే స్థాయిలో తెలుగులో సక్సెస్ కానుంది ఈ మూవీ.

Women Fires On Chandrababu & Pawan Kalyan Over Super Six Schemes || Ap Public Talk || Ys Jagan || TR