ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల, #DNS కోసం కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ #DNS రెండ్రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమా షూటింగ్ కూడా లాంచ్ కి ఒక రోజు ముందే స్టార్ట్ అయ్యింది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు.

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సెన్సిబుల్, కంటెంట్ రిచ్ మూవీస్ చేయడంలో నిష్ణాతుడైన శేఖర్ కమ్ములతో దేవిశ్రీ ప్రసాద్ కి ఇది మొదటి సినిమా. కంటెంట్-బేస్డ్ చిత్రాలకు సెన్సేషనల్ ఆల్బమ్‌లను అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవిశ్రీ #DNS కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించడం ఖాయం.

రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లు.

ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్