వరుస ఆఫర్లతో తెలుగులో దూసుకుపోతున్న దేవ్ మోహన్!!

శాకుంతలం మూవీ లో దుష్యంతుడుగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్న మళయాల నటుడు దేవ్ మోహన్. ఫస్ట్ మూవీలోనే సమంత వంటి టాప్ హీరోయిన్ తో యాక్ట్ చేసే అవకాశం అందుకున్న దేవ్ ఇప్పుడు శాకుంతలం విడుదల కాకుండానే రెండో సినిమాకు సైన్ చేసి తెలుగులో వేగంగా అడుగులు వేస్తున్నాడు. తాజాగా అతని రెండో సినిమా ‘రెయిన్ బో’ముహూర్తం జరుపుకుంది. ఈ చిత్రంలోనూ అతను నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నాతో సరసన నటించబోతుండటం విశేషం. శాకుంతలం చిత్రంలోని అతని లుక్, పాటల్లోని నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే మొదటి సినిమా విడుదలకు ముందే రెండో సినిమా అవకాశాన్నిచ్చింది. అందుకే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. దేవ్ మోహన్ ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమను ఆకర్షించాడు. శాకుంతలం తర్వాత ప్రేక్షకులు కూడా అతన్ని ఆదరిస్తారు అని ఖచ్చితంగా చెబుతున్నారు.

ఈ నెల 14న విడుదల కాబోతోన్న శాకుంతలంతో దేవ్ మోహన్ తెలుగులో పాగా వేయబోతున్నాడు అనుకోవచ్చు.