మెగాస్టార్ చిరంజీవికి“యంగ్ హీరో కార్తికేయ డైహార్డ్ అభిమాని అన్నది చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి స్పూర్తితో సినిమాల్లోకి వచ్చి ఎదుగుతున్నాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కు కుంటున్నాడు. కార్తికేయ పట్ల చిరంజీవి అంతే అభిమానంతో ఉంటారు. ఇలా తన స్పూర్తితో ఎదిగిన వారికి చిరు ఎప్పుడూ తన వంతు సహకారం అందిస్తుంటారు. తమ సినిమా ప్రచారాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు.
తాజా గా కార్తికేయ నటించిన ’బెందురులంక 2012 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో హీరో పాత్ర పేరు చిరంజీవి వాస్తవ పేరుని పెట్టారు. దీంతో ఈ సినిమాలో చిరంజీవి బ్రాండ్ ని వాడుతున్నారా? అన్న ప్రశ్నకు కార్తికేయ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇందులో నా పాత్ర పేరు శివ. ఓ సన్నివేశంలో శివ బిగిన్స్..ఆట మొదలు అన్నట్లు చెప్పాలి. కానీ శివ పేరు చిన్నగా ఉండటంతో దాని ప్రభావం అంతగా కనిపించడం లేదనిపించింది. అదే సమయంలో సెట్లో ఎవరో శివ శంకర్ అనే పేరు ఉంటే బాగుంటుం దన్నారు.
అప్పుడే శివశంకర వర ప్రసాద్ పేరు మదిలోకి వచ్చింది. అలా అప్పటికప్పుడు అనుకుని ఆ షాట్ లో చెప్పాం తప్ప సినిమాలో చిరంజీవి పేరు వాడుకోవాలని అన్న ఉద్దేశం లేదన్నారు. సిటీలో జాబ్ మానేసి బెదురులంక వచ్చిన తర్వాత ఆ గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనలే ఈ సినిమా.
అన్ని రకాల అంశాలు కథలో ఉన్నాయి. మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ప్రతీ సినిమా హిట్ అవ్వాలనే చేస్తాం. కానీ అలా జరగదు. కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి. పోయిన సినిమాలో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటా. యూవీ క్రియేషన్స్ లో ప్రశాంత్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ తో కూడిన కైమ్ర్ కామెడీ చిత్రమిది. మరో రెండు..మూడు సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. అవి ఒకే అయితే అధికారికంగా నేనే చెబుతా’ అని అన్నారు.