చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ – మెగా157 అనౌన్స్ మెంట్

ఇది మీ ఊహకు మించి ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఈ అనౌన్స్ మెంట్ తో మరింత సంతోషిస్తారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేశారు. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సక్సెస్ ఫుల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న #మెగా157 చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాతో వశిష్ట మనకు మెగా మాస్ యూనివర్స్ చూపించబోతున్నారు. విజువల్ గా కట్టిపడేస్తున్నఅనౌన్స్ మెంట్ పోస్టర్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం (పంచభూతాలు ) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి. ఈ అద్భుతమైన పోస్టర్ మెగా మాస్ యూనివర్స్ కు సాక్ష్యంగా నిలుస్తోంది.

ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచడంలో సినిమా ఒక శక్తివంతమైన సాధనం. ఇందులో ఫాంటసీ జోనర్ సరికొత్త, ఊహాతీతమైన ఎక్స్ పీరియన్స్ ని పంచుతుంది. ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాల్లో చిరంజీవి లాంటి స్టార్ నటిస్తే అది మరింత ఎక్సయిటింగ్ గా వుంటుంది. వశిష్ట తొలి చిత్రంతో తన సత్తాను నిరూపించుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న #Mega157 మాస్టర్ పీస్ గా వుండబోతుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి

సాంకేతిక విభాగం:
రచన& దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్