మెగాస్టార్ చిరంజీవి గత సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో తన అభిమానులకు, ప్రేక్షకులకు ఫుల్ మీల్ ఫీస్ట్ అందించారు. మెగాస్టార్‌కు ఈ సంవత్సరం పండుగకు థియేట్రికల్ రిలీజ్ లేనప్పటికీ మెగాస్టార్ మాగ్నమ్ ఓపస్ #Mega156 మేకర్స్ సినిమా టైటిల్‌ను స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ ను లాంచ్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ సంక్రాంతి ప్రజంటేషన్ అందించారు.
గ్లింప్స్ మనల్ని అద్భుత ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అక్కడ ఎవరో మ్యాజికల్ బాక్స్ ని లాక్ చేస్తారు, అది అనుకోకుండా పడిపోయింది. ఇది బ్లాక్ హోల్ గుండా వెళుతుంది. ఒక గ్రహశకలం లోకి క్రాష్ అవుతుంది. అటువంటి అనేక ఆటంకాలు అడ్డంకులు తర్వాత, ఆ మ్యాజికల్ బాక్స్ చివరకు భూమికి చేరుకుంటుంది. ఇది ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో సింబాలిక్ గా చూపించారు. ఒక బిలం భూమిపైకి దూసుకువస్తుంది. అయినప్పటికీ మ్యాజిక్ బాక్స్‌కు ఏమీ జరగదు. చివరి గా ఈ చిత్రం టైటిల్ ‘విశ్వంభర’ గా రివిల్ అవుతుంది.
మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్ అనేది మన ఊహలకు అందనిది, మ్యాజికల్ బాక్స్ ప్రయాణం మనం చూడబోయే గొప్ప సినిమా అనుభవంపై కొంత స్పష్టతను ఇస్తుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ అత్యున్నతంగా వుంది. మరీ ముఖ్యంగా ‘విశ్వంభర’ అనే టైటిల్ చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది.
బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్లీయస్ట్ చిత్రంగా నిలుస్తోంది.
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్లిరిక్ రైటర్స్. శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు.
సినిమా షూటింగ్ ఇనీషియల్ స్టేజ్ లో వుంది. 2025 సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ : ఛోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి
సాహిత్యం: శ్రీ శివ శక్తి దత్తా, చంద్రబోస్
స్క్రిప్ట్ అసోసియేట్స్: శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ శబరీష్
లైన్ ప్రొడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో