చిరంజీవి – మెగా మాస్ బియాండ్ యూనివర్స్ – #Mega156 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ అడ్వెంచర్ #Mega156 దసరాకి గ్రాండ్ గా లాంచ్ అవ్వడంతో పాటు రికార్డింగ్ సెషన్స్ కూడా ప్రారంభమైయ్యాయి. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం రెగ్యులర్ షూట్‌ను ఈరోజు ప్రారంభించారు.

క్లాప్‌బోర్డ్‌ను దర్శకుడు మారుతి డిజైన్ చేసారు. ఇది సీన్ నంబర్ 9ని టీం చిత్రీకరిస్తుందని సూచిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో దట్టమైన అడవిని గమనించవచ్చు. మొదటి షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా టీమ్‌తో జాయిన్ అవుతారు.

అనౌన్స్‌మెంట్ పోస్టర్ సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఆ తర్వాత, రెండు వేర్వేరు సందర్భాలలో విడుదలైన మరో రెండు పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచాయి. ఈ చిత్రం ప్రేక్షకులను మెగా మాస్ బియాండ్ యూనివర్స్‌లోకి తీసుకువెళుతుంది.

విక్రమ్, వంశీ, ప్రమోద్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు చిరంజీవి కెరీర్ లో కాస్ట్లీయస్ట్ చిత్రంగా నిలుస్తోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్ కాగ, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా పని చేస్తున్నారు.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ : ఛోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
సాహిత్యం: శ్రీ శివ శక్తి దత్తా, చంద్రబోస్
స్క్రిప్ట్ అసోసియేట్స్: శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ శబరీష్
లైన్ ప్రొడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో