చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారిలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్. ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
దీపావళిసందర్భంగా, ఈ చిత్రం 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. గతంలో ‘శతమానం భవతి’తో బ్లాక్ బస్టర్ అందించిన శర్వాకు సంక్రాంతి లక్కీ సీజన్.
దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేన పోస్టర్‌లో శర్వా సాంప్రదాయ పంచె కట్టులో పూల మంచం మీద స్టైలిష్‌గా నడుస్తున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. అందమైన డ్యాన్సర్స్, డ్రమ్మర్‌లతో పోస్టర్ లో పండగ వైబ్ కనిపించింది.
ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్ విఎస్, యువరాజ్ కలిసి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. భాను బోగవరపు కథను రాశారు. నందు సావిరిగణ డైలాగ్స్ అందించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. నిర్మాతలు త్వరలో నెక్స్ట్ ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నారు.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, సంయుక్త, సాక్షి వైద్య
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
DOP: జ్ఞాన శేఖర్ VS, యువరాజ్
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.: కిషోర్ గరికిపాటి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

