‘ఛాంగురే బంగారురాజా’ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: రవితేజ

మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాస్ మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకగా గ్రాండ్ గా జరిగింది. హీరో శ్రీ విష్ణు, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కృష్ణ చైతన్య, సందీప్ రాజ్, వంశీ, వెంకటేష్ మహా, నిర్మాత శరత్ మరార్, వివేక్ కూచిభొట్ల, ఎస్కేఎన్.. తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. హిలేరియస్, యంగేజింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీ పెంచింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ముందుగా ‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ నాకు విపరీతంగా నచ్చేసింది. సతీష్ కథ చెబుతున్నపుడు దర్శకుడు పాత వంశీ గారు గుర్తుకు వచ్చారు. ఆయనతో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా చేశాను. అలాంటి హ్యుమర్, ఈస్ట్ గోదావరి వెటకారం, కథ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. తర్వాత ఛాంగురే బంగారురాజా’ పేరు మరింతగా నచ్చింది. మొదటి నుంచి సినిమా పై చాలా నమ్మకం వుంది. ఒక్క రోజు కూడా షూటింగ్ కి వెళ్ళలేదు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో దర్శకుడికి పూర్తి స్వేఛ్చ ఇచ్చాను. ఎందులోనూ కలుగజేసుకోలేదు .‘’నేను నిన్ను, కథను నమ్ముతున్నాను. నీకు నమ్మకం ప్రకారం నీకు నచ్చింది చెయ్’’అని దర్శకుడితో చెప్పాను. నా నమ్మకం సెప్టెంబర్ 15న ప్రూవ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడక్షన్ టీం సినిమాకి కావాల్సింది సమకూర్చారు. మా టీం శ్వేత, శాలిని, ఆర్కే, శ్రీధర్, వింధ్యా రెడ్డి.. వీళ్ళంతా కలసికట్టుగా పని చేసారు. ఈ సినిమా విజయం సాధించి వారికి కూడా మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా వరకూ ఇందులో పని చేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ సినిమా తర్వాత వీరి పేర్లు మోతమ్రోగిపోవాలని కోరుకుంటున్నాను. ఇందులో రవి, ఎస్తర్ ట్రాక్ నాకు చాలా నచ్చింది. అలాగే ఇందులో చాలా ఎంజాయ్ చేసిన పాత్రలు సత్య, నిత్య. కార్తిక్, గోల్డీ కెమిస్ట్రీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కార్తిక్ ఇందులో చాలా ఎంటర్ టైనింగ్ రోల్ చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్ 15న ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. కొత్త ప్రతిభని ప్రోత్సహించడం రవితేజ గారికి కొత్తకాదు. శ్రీనువైట్ల నుంచి వంశీ వరకూ ఎంతో మంది దర్శకులని ప్రోత్సహించారు. ‘షాక్ ‘సరైన ఫలితం ఇవ్వని నేపధ్యంలో మళ్ళీ పిలిచి మిరపకాయ్ చిత్రంతో అవకాశం ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో విడుదలయ్యే ప్రతి సినిమాకి మొదటి ప్రేక్షకుడు మాస్ మహారాజ్ రవితేజ. అదే ఆయన బెస్ట్ క్యాలిటీ. ఇడియట్ సినిమాలో డైలాగ్ లా.. ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు.. రవితేజ మాత్రం ఇక్కడే వుంటారు ఇలానే వుంటారు( నవ్వుతూ). ట్రైలర్ లో చాలా ఫన్ వుంది. ఎక్స్ టార్డినరిగా వుంది. దర్శకుడు సతీష్ చాలా చక్కగా తీశాడు. మంచి కథ వుంటే రవితేజ గారు అవకాశం ఇస్తారని దర్శకులకు గట్టినమ్మకం. ఇప్పుడు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా ఆ నమ్మకం దొరికింది. ఛాంగురే బంగారురాజా’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 15 తప్పకుండా థియేటర్ లో సినిమా చూడండి’’ అని కోరారు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకుడు నాకు మంచి స్నేహితుడు. కార్తిక్ తో తన మొదటి సినిమా చేయడం ఆనందంగా వుంది. సినిమాల్లో నిజాయితీగా కష్టపడి పని చేస్తుంటే ఏదో ఒకరు రవితేజ గారి నుంచి కాల్ వస్తుంది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమా చూసి ఇండస్ట్రీ నుంచి నాకు మొదట కాల్ చేసింది రవితేజ గారే. ప్రతిభ వున్న వారిని తప్పకుండా ప్రోత్సహిస్తారు. రవితేజ గారి బ్యానర్ లో చేయాలని వుంది. కనీసం ఆయనతో ఒక సీన్ లో యాక్ట్ చేయాలని వుంది. ఆ కోరిక త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని కోరుకుంటున్నాను.

కార్తిక్ రత్నం మాట్లాడుతూ.. రవితేజ గారు మా సినిమాని నిర్మిస్తున్నారని తెలిసి మొదట నమ్మలేకపోయాను. రవితేజ గారి జర్నీ మాకు మోటివేషన్. ఆయన మాస్ మాకు ఎనర్జీ. రవితేజ గారు అంటే పిచ్చి. మంచి స్క్రిప్ట్ తీసుకొని రవితేజ గారి దగ్గరకి వస్తే సినిమా హిట్ అయిపోతుంది. దర్శకుడు సతీష్ కు స్పెషల్ థాంక్స్. నాపై నమ్మకంతో ఈ పాత్రని ఇచ్చారు. మా టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 15 అందరూ థియేటర్ కి వచ్చి చూడాలి. తప్పకుండా గట్టిగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు

వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. రవితేజ గారు మాస్ మహారాజానే కాదు మనసున్న మహారాజు కూడా. చాలా మంది నటీనటులకు, సాంకేతిక నిపుణలకు, నిర్మాతలకు అవకాశాలు ఇచ్చి వారికి కెరీర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నిర్మాతగా కూడా అవకాశాలు ఇవ్వడం ఆనందంగా వుంది. మంచి ప్రోడక్ట్ తో సెప్టెంబర్ 15న మీ ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’

అనుదీప్ మాట్లాడుతూ.. రవితేజ గారిని మొదటి సారి నేరుగా చూడటం చాలా ఆనందంగా వుంది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు.

ఎస్కేఎన్ మాట్లాడుతూ.. కలిసొచ్చే హిట్స్ కి రిలీజ్ డేట్ నడిసోస్తాయి. సెప్టెంబర్ 15 చాలా మంచి డేట్. రవితేజ గారి హ్యాండ్ పడితే అది బంగారమే. బ్యాగ్రౌండ్ లేనివారికి ఇండస్ట్రీ లో ఒక గ్రౌండ్ ఉంటుందంటే అది రవితేజ గారే. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని కోరారు.

సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఛాంగురే బంగారురాజా’ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చాలా బావుంది. కార్తిక్ రత్నం నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారందరికీ రవితేజ గారు బ్యాగ్రౌండ్ కావడం చాలా ఆనందంగా వుంది. కలర్ ఫోటో చూసి నన్ను మొదట విష్ చేసింది రవితేజ గారు. కార్వాన్ లో కూర్చోబెట్టి దాదాపు అరగంట మాట్లాడారు. మేము ఏదో గొప్పగా సాధించామనే భావన ఆ క్షణం కలిగింది. మాలాంటి వారిని ప్రోత్సహిస్తున్న రవితేజ గారి మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.

శరత్ మరార్ మాట్లాడుతూ.. రవితేజ గారి సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా వుంటుంది. అలాగే ఆయనతో కలసి కాసేపు మాట్లాడినా అదే ఉత్సాహం, ఆనందం వుంటుంది. రవితేజ ఏది చేసిన చాలా ఫోకస్ గా చేస్తారు. అదే సమయంలో చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తారు. ఆయన వ్యక్తిత్వం తెరపై కనిపిస్తుంది. రవితేజ గారి నిర్మాణ సంస్థని ప్రారంభించి ఇలా కొత్త వారికి అవకాశం ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ లో ఫన్ యాక్షన్ థ్రిల్ అన్నీ వున్నాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

వెంకటేష్ మహా మాట్లాడుతూ.. రవితేజ గారితో వేదిక పంచుకోవడం ఆనందంగా వుంది. సినిమా పరిశ్రమలోకి వచ్చేవారికి రవితేజ గారు ఒక నమ్మకం. అదే నమ్మకంతో నేను వచ్చాను. సినిమాలో రాణించాలనే వారికి రవితేజ గారు స్ఫూర్తి. రవితేజ నిర్మాతగా కొత్తవారికి అవకాశాలు కల్పించడం ఆనందంగా వుంది. నా మొదటి సినిమా ‘C/o కంచరపాలెం’ లో చేసిన కార్తిక్ రత్నం ఇందులో హీరో కావడం కూడా చాలా ఆనందంగా వుంది. తను సినిమా కోసం చాలా కష్టపడతాడు. సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదలై మీ అందరి ఆదరణ పొందుతుందని కోరుకుంటున్నాను’’ అన్నారు

సినిమా డైరెక్టర్ సతీష్ వర్మ మాట్లాడుతూ.. ఛాంగురే బంగారురాజా’.. రెండు గంటల సినిమాలో గంటన్నర ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఫ్యామిలీతో పాటు చూసే క్లీన్ ఎంటర్ టైనర్ చేశాం. కుటుంబంతో కలసి చూసి హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చు. కొత్తవారిని నమ్మి సినిమా ఇచ్చే వాళ్ళు చాలా అరుదుగా వుంటారు. రవితేజ గారు మాలోని ప్రతిభని నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చారు. నిజంగా ఇది మాకు బంగారం లాంటి అవకాశం. మీ అందరూ సపోర్ట్ చేస్తే మాలాంటి ఇంకో పదిమందికి అవకాశం దొరుకుతుంది. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రవితేజ గారికి మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.

గోల్డీ నిస్సీ మాట్లాడుతూ.. ‘ఛాంగురే బంగారురాజా’ సినిమాతో మాకు బంగారం లాంటి అవకాశం ఇచ్చిన రవితేజ గారికి థాంక్స్. యువ ప్రతిభని ప్రోత్సహించడంలో రవితేజ గారు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా ఎప్పుడూ నా మనసులో వుండిపోతుంది. రవితేజ గారిని కలవడమే ఒక అదృష్టం. ఛాంగురే బంగారురాజా’ ఎంగేజింగ్ ఎంటర్ టైనర్. పర్ఫెక్ట్ వీకెండ్ సినిమా ప్రేక్షకులు చూడబోతున్నారు. టీం అందరికీ థాంక్స్. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

నిత్య శ్రీ మాట్లాడుతూ.. రవితేజ గారికి ధన్యవాలు. ఒక మంచి సినిమా ముందుకు వెళ్ళాలంటే మంచి వ్యక్తి తోడు ఉండాలి. మనకి రవితేజ గారు తోడు ఉన్నారు. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగుంటుంది. తప్పకుండా థియేటర్ లో చూడండి’’ అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గోన్నారు.