‘హాయ్ నాన్న’ ని పెద్ద సక్సెస్ చేసి మీ మనసులో పెట్టుకున్నందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు: నాని

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్ తో అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఈ వేడుకలో హీరో నాని చేతుల మీదగా చిత్ర యూనిట్ సభ్యులకు మెమెంటోలు అందించారు.

బ్లాక్ బస్టర్ నాన్న సెలబ్రేషన్స్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. హాయ్ నాన్న జర్నీ వీడియో చూసినప్పుడు ఇన్ని చోట్ల తిరిగామా అనిపించింది. ఇది చాలా స్పెషల్ ఫీలింగ్. సినిమా విజయం తర్వాత జరుపుకునే ఇలాంటి వేడుకలో ఒకరికి ఒకరు థాంక్స్ చెప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ వేడుకలో అందరితో కలసి గడపటం గొప్ప అనుభూతిని ఇస్తోంది. హాయ్ నాన్నకి మ్యాజిక్ కియరా. మృణాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. దర్శి ఈ సినిమాతో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. ఇందులో నటించిన అందరూ తమ సినిమా అని వోన్ చేసుకున్నారు. జయరాం గారు, నాజర్ గారు, శిల్పా గారు బ్రిలియంట్ గా పెర్ఫార్మ్ చేశారు. రితిక చాలా మంచి పాత్ర చేసింది. హేషం ఏదైనా బోలెడంత ఇష్టం, ప్రేమతో చేస్తాడు. అది ప్రతి పాటలో, బీట్ లో కనిపించింది. ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశాడు. మ్యాజిక్ క్రియేట్ చేశాడు. షాను గారు తెలుగులో చేసిన మూడు సినిమాలు నావే. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. షాను గారు కెమరాతో కథ చెప్పగలిగే గ్రేట్ టెక్నిషియన్. తన ప్రతి ఫేం ఒక కథ చెబుతుంది. మోహన్, విజయేందర్ గారికి ఇది మొదటి సినిమా. కొత్త ప్రొడక్షన్ హౌస్ కి మ్యాజికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వగలిగితే గొప్ప ఆనందంగా వస్తుంది. అలాంటి అనుభూతి హాయ్ నాన్నతో నేను ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకులు ఎన్నో ప్రశంశలు కురిపిస్తున్నారు. నేను నమ్మంది నిజమైనందుకు ఆనందంగా వుంది. ఈ జర్నీ ఇంత అద్భుతంగా మొదలైనందుకు వారికి అభినందనలు. ఎడిటర్ ప్రవీణ్ అంథోని, ఆర్ట్ డైరెక్టర్ అవినాస్ ఇలా టీం అంతా సినిమాకి బలమైన సపోర్ట్ లా దర్శకుడు శౌర్యువ్ తో కలసిపని చేశారు. కృష్ణ కాంత్, అనంత్ శ్రీరామ్ గారు చక్కని సాహిత్యం అందించారు. రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. విజయం రెండు రకాలుగా వుంటుంది. ఒకటి.. అందరూ గెలుస్తారని అనుకుంటారు.. వాళ్ళే గెలుస్తారు. రెండు.. అందరూ గెలవరేమో అనుకుంటారు.. వాళ్ళే గెలుస్తారు. ఈ రెండు రకాల విజయాలు 2023 నాకు ఇచ్చింది. ఒక స్టేడియం అంతా చీర్ చేస్తుంటే గెలవడం చూశాను. స్టేడియం అంతా సైలెంట్ గా వుంటే గెలవడం చూశాను. రెండూ ఒక సంవత్సరంలోనే జరిగాయి. హాయి నాన్న లాంటి బ్యూటీఫుల్ ఫిల్మ్ తో ఈ విజయం అందుకోవడం ఇంకా స్పెషల్. బాక్సాఫీసు లెక్కలు, స్థానాలు, స్థాయిలని మాట్లడుతుంటారు. నాకు సంబంధించినంత వరకూ శుక్రవారం సినిమా విడుదలైతే ‘’నాని సినిమాకి వెళ్దాంరా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదనినమ్ముతాను. ఆ స్థాయి, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. హాయ్ నాన్నని ఇంత పెద్ద సక్సెస్ చేసిందుకు, మీ మనసులో పెట్టుకున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు ఎప్పటికీ రుణపడివుంటాం. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే వుంటాను. ఈ రోజు తర్వాత హాయ్ నాన్న టీం ని మిస్ కావచ్చు, కానీ హాయ్ నాన్నకి వచ్చిన ప్రేమని మాత్రం మిస్ కాను. ఈ ప్రేమ ఎక్కడా ఆగదు. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు

దర్శకుడు శౌర్యువ్ మాట్లాడుతూ.. సాను జాన్ వర్గీస్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆయనతో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. హేషం హాయ్ నాన్నలో భాగం కావడం చాలా ఆనందంగా గర్వంగా వుంది. పాటలు, నేపధ్యం సంగీతం నెక్స్ట్ లెవల్ లో చేశారు. ఎడిటర్ ప్రవీణ్, ఆర్ట్డైరెక్టర్ అవినాష్ కి థాంక్స్. తన వల్ల నాకు చాలా కలిసొచ్చాయి. కృష్ణ కాంత్, ఆనంత్ శ్రీరాం చాలా మంచి సాహిత్యం అదించారు. రైటర్ నాగేంద్ర కాశి గారు హాయ్ నాన్నలో భాగం కావడం అనందంగా వుంది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. నాజర్ గారు, జయరామ్ గారు, శిల్పా గారు చాలా అద్భుతంగా నటించారు. వారితో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. దర్శి గారు తన పాత్రని పోషించడమే కాదు దానికి సంబధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. అలాగే అరవింద్ పాత్ర చేసిన అంగద్ బేడి గారికి థాంక్స్. ఈ చిత్రంలో ప్లూటో( డాగ్) కూడా ఒక పాత్రగా ప్రేక్షకులకు గుర్తుండిపోయంది. కియారా వండర్ కిడ్. చాలా చక్కగా నటిచింది. మృణాల్ ఈ సినిమాని చాలా బలంగా నమ్మారు. యష్ణ పాత్రలో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. నాని గారు ఈ కథని నా కోసం, తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను. నాని గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని గారి వలనే ఇంత పెద్ద విజయం సాధ్యపడింది. నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్’’ తెలిపారు.

నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ.. శౌర్య కథ చెప్పినప్పుడే ఏడిపించాడు. చాలా ఎమోషనల్ అయ్యా. నాని గారు ఫస్ట్ సిట్టింగ్ లోనే కథకు ఓకే చెప్పారు. నాని గారికి ధన్యవాదాలు. హేశం, షాను, మృణాల్, కియరా టీం అందరికి థాంక్స్. ఇది నాని గారు మా బ్యానర్ కి ఇచ్చిన ఎలివేషన్. ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

ప్రియదర్శి మాట్లాడుతూ.. హాయ్ నాన్నతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఇచ్చిన దర్శకుడు శౌర్యువ్ కి థాంక్స్. నాని గారు ఈ కథ చేస్తున్నారని తెలియగానే చాలా ఆనందంగా అనిపించింది. నాని అన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్ ని ఆయన ప్రోత్సహించే విధానం అద్భుతంగా వుంటుంది. కియారా అద్భుతంగా నటించింది. మృణాల్ మరో అద్భుతమైన పాత్ర పోషించింది. ఈ టీంలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

బేబీ కియారా మాట్లాడుతూ… హాయ్ నాన్నపై మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్. మహి పాత్ర కోసం నన్ను ఎంపిక చేసుకున్న నాని గారు, డైరెక్టర్, నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో పని చేయడం అద్భుతమైన అనుభూతి. లవ్ యూ ఆల్’’ అన్నారు

హేషం అబ్దుల్ మాట్లాడుతూ.. హాయ్ నాన్న నా మనసుకు దగ్గరైన చిత్రం. శౌర్యవ్ నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ చిత్రం చాలా కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. హాయ్ నాన్న ఆల్బం నా మనసులో నిలిచిపోయింది. నాని గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ తెలిపారు. ఈ వేడుకలో కృష్ణకాంత్ షాను వర్గీస్, రితిక నాయక్, శిల్పా, నాగేంద్రకాశి తదితరులు పాల్గొన్నారు.