జులై 7న విడుదల కానున్న భాగ్ సాలే చిత్రం

ప్రేక్షకులను వినూత్నమైన కథలతో ఆకట్టుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు శ్రీ సింహ కోడూరి. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ‘భాగ్ సాలే’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.

ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచిన ఈ సినిమా జూలై 7న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.

అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది. నేహా సోలంకీ, రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకొంటోంది.

నటీనటులు : శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్, ప్రిథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి

నిర్మాతలు : అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
ఛాయాగ్రహణం : రమేష్ కుషేందర్
సంగీతం : కాల భైరవ
ఎడిటర్ : ఆర్.కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్ : జే పి
ప్రొడక్షన్ డిజైనర్ : శృతి నూకల
ఫైట్ మాస్టర్ : రమ కృష్ణ
కొరియోగ్రాఫర్ : భాను, విజయ్ పోలకి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అశ్వత్థామ, గిఫ్ట్సన్ కొరబండి