బెల్లంకొండ గణేష్‌, నేను స్టూడెంట్‌ సార్‌! నుంచి సాంగ్‌ లాంఛ్‌ చేసిన విశ్వక్‌సేన్‌

‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్ తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ సినిమా పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది. నేడు ` 24/7 ఒకటే ధ్యాస` సాంగ్ ను రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో యంగ్‌ ఎనర్జిటిక్‌ హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు.

అనంతరం యంగ్‌ ఎనర్జిటిక్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, నేనూ రోజూ స్టూడెంట్‌ గానే ఫీలవుతాను. ఈ టైటిల్‌ విన్నప్పుడు కాలేజీ రోజులు గుర్తుకు వచ్చేవి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు నేను స్టూడెంట్‌ సార్‌ అనేవాడిని. టీజర్‌ చాలా ప్రామిసింగ్‌ గా వుంది. నిన్న నాంది సతీష్‌గారు వచ్చి ఆహ్వానించారు. ఆయన చెప్పిన కంటెంట్‌ నచ్చింది. నేనూ పార్ట్‌ కావాలని ఈరోజు వచ్చాను. ఇంకో కారణం బెల్లంకొండ గణేష్‌. మేమిద్దం జుంబా క్లాస్‌ కు వెళ్ళే వాళ్ళం. ఆ తర్వాత జిమ్‌ లో కలిశాం. గణేష్ కాంటెంపరరీ కథల తో వస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌. రచయిత కృష్ణ చైతన్య కూడా దర్శకత్వం చేస్తున్నాడు. ఇందులో పాట రాసిన హర్ష కూడా మా సినిమాలో లవ్‌ సాంగ్‌ రాశాడు. సాగర్‌ అమేజింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. యూనిట్‌ కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

బెల్లంకొండ గణేష్‌ మాట్లాడుతూ, ఈరోజు సాంగ్‌ చూశారు. ఫోన్‌ కొనడానికి కష్టపడుతూండగా వచ్చే మోన్‌ టేజ్‌ సాంగ్‌ ఇది. చాలా ఎంజాయ్‌ చేసేలా వుంటుంది. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని సినిమాలు చేసే విశ్వక్‌ అంటే ఇష్టం. తన నుంచి చాలా నేర్చుకోవాలి. పదేళ్ళనాడు తనను కలిసినప్పుడు చాలా క్లాస్‌ గా వుండేవాడు. అలాంటిది దాస్‌ కా మాస్‌ అంటూ మారిపోయాడు. జూన్‌ 2న మా సినిమా విడుదలవుతుంది. తప్పకుండా చూడండి అని అన్నారు.

రచయిత కృష్ణ చైతన్య మాట్లాడుతూ, లాక్‌ డౌన్‌ లో రాసిన కథ ఇది. అప్పుడు సతీష్‌ గారు అడిగితే ఈ కథ వినిపించాను. కాలేజీలో వున్నప్పుడు లెఫ్ట్‌ వింగ్‌, రైట్‌ వింగ్‌ ఆలోచనలు వుంటాయి. కానీ జీవితానికి వచ్చేసరికి ఏ వింగ్‌ లూ వుండవు. అదే ఈ సినిమా కథ. మహతీ సాగర్‌ చక్కటి బాణీలు సమకూర్చారు. టెక్నీషియన్స్‌ అందరూ కష్టపడి పనిచేశారు. జూన్‌ 2న థియేటర్లో కలుద్దాం అని అన్నారు.

గీత రచయిత హర్ష మాట్లాడుతూ, అందరికీ రిలేటెడ్‌ గా వుండే పాట రాశాను. ఎంజాయ్‌ చేస్తూ రాశాను. దర్శకుడు చెప్పిన సిట్యువేషన్‌ కు అనుగుణంగా రాశా. రేపు థియేటర్‌ లో మీరు ఎంజాయ్‌ చేస్తారు అన్నారు.

నటి రితిక మాట్లాడుతూ, మాయే మాయే సాంగ్‌ లా ఈ రోజు రిలీజ్ అయిన సాంగ్‌ హిట్‌ అవుతుంది ,జూన్‌ 2న సినిమా విడుదలవుతుంది. మీరు పెట్టే పైసాకు న్యాయం జరుగుతుంది. నేను ఇందులో చక్కని పాత్ర పోషించాను అన్నారు.

దర్శకుడు రాఖీ మాట్లాడుతూ, విశ్వక్‌ సేన్‌ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన రిసీవింగ్‌ బాగుంది. ఆయన ఈ సాంగ్‌ విడుదల చేయడం ఆనందంగా వుంది. జూన్‌ 2న సినిమా విడుదలవుతుంది. అందరూ చూసి ఎంకరేజ్‌ చేయండి అన్నారు.

మరో నటి అవంతిక మాట్లాడుతూ, విశ్వక్‌ గారు లాంచ్‌ చేసినందుకు థ్యాంక్స్‌. అందరూ కష్టపడి పనిచేశాం. సినిమా చూడండి. మమ్మల్ని ఎంకరేజ్‌ చేయండి అన్నారు.

చిత్ర నిర్మాత నాంది సతీష్‌ వర్మ మాట్లాడుతూ, నేను స్టూడెంట్‌ సార్‌ ముందే విడుదలచేయాలనుకున్నాం. కానీ స్టూడెంట్స్‌ కు పరీక్షలని ఆగాం. ఈరోజు సాంగ్‌ కూడా అనుకోకుండా విదుదల చేశాం. విశ్వక్‌సేన్‌ గారికి కాల్‌ చేయగానే వెంటనే రమ్మన్నారు. షూటింగ్‌ లో బిజీగా వున్నా ఆయన వచ్చినందుకు థ్యాంక్స్‌. ఈరోజు విడుదల చేసిన సాంగ్‌ వివిధ లొకేషన్లలో తీశాం. హీరో క్యారెక్టర్‌ ఏమిటో ఈ సాంగ్‌ ద్వారా చెప్పాం. జూన్‌ 2న సినిమా విడుదలవుతుంది. చూసి ఆనందించండి అన్నారు.