బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్!’ జూన్ 2న విడుదల

‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్ థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే, ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ తో వచ్చారు మేకర్స్. ‘నేను స్టూడెంట్ సార్!’’ జూన్ 2న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. జూన్ రెండవ వారం తర్వాత విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తాయి కాబట్టి ఇది అనువైన డేట్.

గణేష్, అవంతిక దస్సాని సహా ప్రముఖ తారాగణం ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి ప్రమోషన్స్ జోరు పెంచనున్నారు.

సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి కెమెరామెన్ గా పని చేస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో వంశీ-శేఖర్