Skip to content
TeluguRajyam Logo
  • హోమ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • తెలంగాణ‌
  • సినిమా
  • మూవీ రివ్యూ
  • గాసిప్స్
  • ప్రత్యేకం
  • లైప్‌స్టైల్‌
  • ఫొటోస్
  • ఇంగ్లీష్

Home » “బాలుగాడి లవ్ స్టోరీ” టీజర్ ను విడుదల: మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

“బాలుగాడి లవ్ స్టోరీ” టీజర్ ను విడుదల: మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

By Akshith Kumar on January 16, 2023

శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి నటీ నటులుగా యల్. శ్రీనివాస్ తేజ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం “బాలుగాడి లవ్ స్టోరీ”. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో ముందుగా విడియో బైట్ ద్వారా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విడుదల చేసిన చిత్ర టీజర్ ను పాత్రికేయ మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. టీజర్ లాంచ్ అనంతరం ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు సముద్ర గారు చిత్ర మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం జరిగింది.ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హరి గౌడ్, శ్రీహరి గౌడ్, రెవలాన్స్ కాస్మటిక్స్ సౌత్ ఇండియా ఇన్చార్జి మహేష్, చిందం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం దర్శకులు సముద్ర మాట్లాడుతూ…”బాలు గాడి లవ్ స్టోరీ” టీజర్ చాలా బాగుంది. నటీ నటులు కొత్తవరైనా చాలా బాగా నటించారు. దర్శకుడు కొత్త వాడైనా సినిమా చాలా బాగా తీశాడు. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను నమ్మి తీసిన నిర్మాతకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీం అందరికీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ..దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ చెప్పిన కథ నచ్చడంతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా తియ్యడం జరిగింది. మంచి కంటెంట్ తో వస్తున్న సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “బాలుగాడి లవ్ స్టోరీ” సినిమా గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ..సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే వీడియో రూపంలో మా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు.మరియు ఈ రోజు మా టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన సముద్ర గారికి ధన్యవాదాలు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రంలో లవ్, అండ్ క్రైమ్, సస్పెన్స్ తో ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు కొత్త వారైనా చాలా బాగా నటించారు.ఈ సినిమాలో ఐదు పాటలు ఉండగా ఇందులో ఉన్న ఒక్క ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ తో పాటు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.ఈ పాటను ఈ నెలలో పూర్తి చేసుకుని మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

చిత్ర హీరో ఆకుల అఖిల్ మాట్లాడుతూ..బాలుగాడి లవ్ స్టోరీ సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులో రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా చాలా ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుండి ఇప్పటివరకు చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాము.మంచి కథతో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ అయితే మా పేరెంట్స్ కు ఈ సినిమాను గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

చిత్ర హీరోయిన్ దర్శక మీనన్ మాట్లాడుతూ.. ” బాలుగాడి లవ్ స్టోరీ” సినిమాలో హీరోయిన్ గా చేసి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీ నటులు
ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : శ్రీ ఆకుల భాస్కర్
బ్యానర్ : భామ క్రియేషన్స్
రైటర్, డైరెక్టర్ : యల్. శ్రీనివాస్ తేజ్
నిర్మాత : ఆకుల మంజుల
సహ నిర్మాతలు : జి. ప్రతిభ, అనిత,
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆకుల సాయి తేజ
డి.ఓ.పి : రవి కుమార్ నీర్ల
మ్యూజిక్ డైరెక్టర్ : ఘనశ్యామ్
ఎడిటర్ : యాదగిరి కంజారాల
కో డైరెక్టర్ : ఆళ్ళ శ్రీను
అసోసియేట్ డైరెక్టర్ : అరకాల శశాంక్
కోరి్యోగ్రాఫర్స్ : మోహన్ కృష్ణ, లక్ష్మిపురెడ్డి
ఫైట్స్ : అశోక్ రాజ్
పి. ఆర్. ఓ : హరీష్, దినేష్

YouTube video player

See more ofNews PressAkula Akhil Balu Gadi Love Story Teaser Darshaka Menon Manjula Akula samudra talasani srinivas yadav

Related Posts

Love Days: మంచి ప్రేమ కథతో వస్తున్న ‘లవ్ డేస్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు సముద్ర

“‘అన్నపూర్ణ తల్లి బువమ్మ’ లాంటి ఆదర్శమైన చిత్రాలు మరెన్నో రావాలి” ఈవెంట్ లో మాజీ మంత్రి బాలినేని

Telangana TDP: తెలంగాణలో టీడీపీ పొలిటికల్ సెగలు.. బీఆర్ఏస్ లో అలజడి?

పొలిటికల్ హీట్ లో తలసాని-రేవంత్ భేటీ.. ఎందుకంటే..

Facebook Twitter Whatsapp Telegram Pinterest Email

Recent Articles

  • చిన్నారుల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వ భరోసా.. ‘ఎన్‌పీఎస్ వాత్సల్య’తో సురక్షిత పెట్టుబడి..!
  • సంక్రాంతి ప్రయాణికులకు ఊరట.. టోల్ గేట్ల ట్రాఫిక్‌పై చర్యలు..!
  • Heroine Samyuktha Interview: ‘నారి నారి నడుమ మురారి’ అందరూ ఎంజాయ్ చేసే ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరోయిన్ సంయుక్త
  • Tea: రాత్రి టీ తాగే అలవాటు ఉందా.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
  • Srinivasa Mangapuram: సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన జయ కృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
  • Director Anil Ravipudi Inteview: మన శంకర వర ప్రసాద్ గారు అందరికీ కనెక్ట్ అయ్యే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: డైరెక్టర్ అనిల్ రావిపూడి
  • Oh..! Sukumari: తిరువీర్, భరత్ దర్శన్ ‘ఓ..! సుకుమారి’ నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్
  • AP Government: ‘బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా?’.. ఏపీలో ఈ ప్రశ్న ఎవరిని అడగాలి..?
  • Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ గారు
  • Raaja Saab Movie: స్పెషల్: ‘రాజా సాబ్’ తో రాజ్ కపూర్ పాట!
  • ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్
  • నారి నారి నడుమ మురారి కొత్త కాన్ఫ్లిక్ట్ తో అలరించే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: డైరెక్టర్ రామ్ అబ్బరాజు
  • By-elections: ఏపీలో ఆ ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము ఎవరికుంది..?
  • Nara Lokesh: ‘సొంతిల్లు.. కిరాయి ఇల్లు’… లోకేష్ సంచలన వ్యాఖ్యలు కూటమిలో బీటలకు సంకేతమా..?
  • Purushaha: ఆసక్తికరంగా ‘పురుష:’ టీజర్.. ఒక్కో షాట్ ఒక్కో ఆణిముత్యం అంతే..!
  • WINClub: యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు కాలేజీల్లో “విన్.క్లబ్” (WIN.Club) ప్రారంభించిన “ఈటీవీ విన్”
  • Hombale Films: ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో రెండు సినిమాలతో చరిత్ర సృష్టించిన హోంబాలే ఫిల్మ్స్
  • Maa Inti Bangaram Teaser: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ రోల్‌లో అద‌ర‌గొట్టిన స‌మంత‌
  • The Raaja Saab Movie Review: ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ!
  • Raakaasaa: సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల‌, ఉమేష్ కుమార్ బ‌న్సాల్ నిర్మిస్తోన్న‌ చిత్రం ‘రాకాస’.. టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్

TeluguRajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with an objective of creating an informed public.

Contact us: newsdesk@telugurajyam.com

  • Home
  • Privacy Policy
    • Corrections Policy
    • Ethics Policy
    • Fact-Checking Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright - TeluguRajyam.com