ఘనంగా జరిగిన బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుక

నట సింహ నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ‘వీర సింహారెడ్డి 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘వీర సింహారెడ్డి’ 100 రోజుల వేడుకను ఘనంగా జరిపారు మేకర్స్. యూనిట్ కు 100 రోజుల షీల్డ్‌లను అందించారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా షీల్డ్‌లు అందించారు.

చిత్ర యూనిట్ తో పాటు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, సితార నాగ వంశీ, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.