కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ ఈ నెల 29న విడుదల

నంది అవార్డ్ గ్రహీత రవి చావలి దర్శకత్వంలో, N. రమేశ్ కుమార్ గారు నిర్మాత గా రూపొందిన చిత్రం బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్”. శాసనసభ చిత్రంతో హీరో గా గుర్తింపు పొందిన ఇంద్రసేన , మ్యాడ్ చిత్రం లో నటించిన సంతోష్ హీరోలు గా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి దగ్గర పని చేసే ఇద్దరు కుర్రోళ్ళు , అతన్నే ఎందుకు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ లో తెలిసిన రహస్యాలు ఏమిటి. చివరకు వాళ్ళు అనుకొన్న డబ్బు సంపాదించారా లేదా అనే పాయింట్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా కథ నడుస్తుంది. మలయాళీ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ నటుడు తారక్, శుభలేఖ సుధాకర్ గారు ప్రత్యేక పాత్రలో నటించారు.

ఈ చిత్రం రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు , బెంగళూర్ , టెక్సాస్ మరియు అండమాన్ లో ఈ నెల 29 వ తేదీ న రిలీజ్ అవుతుంది.

నటీనటులు : ఇంద్రసేన, సంతోష్, ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి, మెర్లిన్ ఫిలిప్, తారక్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, దుర్వాసి మోహన్, ఘర్షణ శ్రీనివాస్, ఉష

ప్రొడక్షన్ : కషూ క్రియేషన్స్
నిర్మాత : N. రమేష్ కుమార్
దర్శకుడు : రవి చావలి

సంగీతం : బిగ్ బాస్ ఫేం భోలే షవాలి
కెమెరా మ్యాన్ : విజయ్ సి కుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
మాటలు : ఘటికచలం
ఫైట్స్ : కృష్ణంరాజు
డాన్స్ : హుస్సేన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శేఖర్ అలవకపాటి
లైన్ ప్రొడ్యూసర్ : తోట శ్రీకాంత్
పి ఆర్ ఓ : మధు VR