జులై 2వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న బేబీ చిత్రం

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో బేబీ సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్ నిర్మించారు.

ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను యూట్యూబ్‌ లో విపరీతంగా ఆకట్టుకున్నాయి. బేబి చిత్రానికి విజయ్ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ఈ సినిమా నుంచి ఓ రెండు మేఘాలిలా మరియు దేవరాజ అని రెండు పాటలు విడుదలై మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక ఈ మధ్య రష్మిక మందాన ఈ సినిమా నుంచి విడుదల చేసిన బ్రేకప్ సాంగ్ ‘ప్రేమిస్తున్నా’ అయితే యూత్ కి వెంటనే కనెక్ట్ అయిపోయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుంచి నాలుగవ పాట కూడా ఈ వారం లో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇలా టీజర్ మరియు పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చుకోవడమే కాకుండా విడుదల తేదీ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకుల ను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. అయితే ఇప్పుడు సినీ ప్రియలందరూ ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ ఎత్తకేలకి వచ్చేసింది.

ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. వీటిని కూడా త్వరగా పూర్తి చేసుకొని జూలైలో అందరినీ అలరించడానికిసిద్ధమవుతుంది ఈ సినిమా.

నిర్మాత: SKN,
ప్రొడక్షన్ హౌస్: మాస్ మూవీ మేకర్స్
రచన & దర్శకత్వం: సాయి రాజేష్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: విప్లవ్
కళ: సురేష్
సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్
ప్రొ: జీఎస్‌కే మీడియా, ఏలూరు శ్రీను
కొరియోగ్రాఫర్: పోలాకి విజయ్.