సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్ వికె, బివి నందిని రెడ్డి, స్వప్న సినిమా.. క్రేజీ కాంబినేషన్. ‘అన్నీ మంచి శకునములే’ అనే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం వీరందరూ కలిసి పనిచేశారు. ఇప్పటికే విభిన్నమైన పాత్రలు చేసి తన ప్రతిభ చాటిన సంతోష్ శోభన్, నందిని రెడ్డి గత చిత్రం ఓ బేబీ బ్లాక్ బస్టర్ కాగా, స్వప్న సినిమాస్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానట, సీతా రామం వంటి క్లాసికల్ హిట్‌లను అందించింది. టీజర్‌ని విడుదల చేసి చిత్రబృందం ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. సీతారామం స్టార్ దుల్కర్ సల్మాన్ టీజర్ లాంచ్ చేశారు.
రెండు విభిన్నమైన, ప్లజంట్ కుటుంబాలను, వారి మధ్య అందమైన బంధాన్ని టీజర్ పరిచయం చేస్తుంది. ఈ 76-సెకన్ల వీడియోలో భావోద్వేగాలతో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌లా వుంది. హిల్ ఏరియా నేపథ్యంలో సాగే కథ, విజువల్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ మెయిన్ లీడ్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి ప్రజన్స్ కంప్లీట్ నెస్ ని తీసుకొచ్చింది
ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో పేరుపొందిన నందిని రెడ్డి అందమైన భావోద్వేగాలతో కూడిన మరో బ్రీజీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ముందుకు వచ్చారు. సన్నీ కూరపాటి కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫన్ , రోమాన్స్, భావోద్వేగాలకు అదనపు టచ్ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల మాటలు అందించారు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
సమ్మర్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్‌లో ఒకటిగా మే 18న సినిమాను విడుదల చేస్తామని టీజర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.
తారాగణం: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: బివి నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
బ్యానర్లు: స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: సన్నీ కూరపాటి
డైలాగ్ రైటర్: లక్ష్మీ భూపాల
కాస్ట్యూమ్ స్టైలిస్ట్: పల్లవి సింగ్
స్క్రీన్ ప్లే రైటర్: దావూద్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు
పీఆర్వో: వంశీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్