బాలయ్యతో కాజల్.. తల్లిగా అంటే?

నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా తర్వాత తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు 50 ఏళ్ల పైబడిన ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కనిపించబోతున్నాడు.

ఇక ఇందులో ఆయన కూతురుగా శ్రీ లీలా కనిపించబోతోంది అని ఇదివరకే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అని కూడా ఇదివరకే ఒక టాక్ వినిపించింది. ఇక ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

హాని రోజ్ అని టాక్ వచ్చింది కానీ అందులో నిజం లేదు అని తెలుస్తోంది. ఇక మరోవైపు కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో శ్రీ లీల కు తల్లిగా కనిపించే పాత్రలో కాజల్ నటించనున్నట్లు మరొక టాక్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అలాగే ఫస్ట్ ఆఫ్ లో ఒక హీరోయిన్ కూడా బాలయ్య బాబుతో డిఫరెంట్ రొమాంటిక్ క్యారెక్టర్ లో కూడా సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక కాజల్ తల్లి క్యారెక్టర్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లే. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. దర్శకుడు అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ కటౌట్ తగ్గట్టుగానే ఈ కథను డిజైన్ చేస్తూ మరోవైపు తన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా మొదలుపెట్టి ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు.