అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ డబ్బింగ్ ప్రారంభం

హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన హీరో నరేష్ మాస్-అప్పీలింగ్ బర్త్ డే గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

‘బచ్చల మల్లి’మూవీని ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్ ఇటివలే ఎనౌన్స్ చేశారు. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ ని ప్రారంభించారు.

ఈ మూవీలో నరేష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్ లో ఆదరగొట్టబోతున్నారు. డైరెక్టర్ సుబ్బు నరేష్ ని మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు ‘సీతా రామం’ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

కథ, డైలాగ్స్ సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.

నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
ఎడిషనల్ స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర
సంగీతం- విశాల్ చంద్రశేఖర్
డీవోపీ- రిచర్డ్ M నాథన్
ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి
పీఆర్వో – వంశీ-శేఖర్
మార్కెటింగ్-ఫస్ట్ షో