ఆలియా భట్‌ హాలీవుడ్‌ ఎంట్రీ!

బాలీవుడ్‌ లో స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్‌. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ’ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా అలియా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు హాలీవుడ్లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ’హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఈ సినిమాలో మొదటిసారి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్‌ తన సహ నటులు గాల్‌ గడోట్‌, జేవిూ డోర్నన్‌ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా హాలీవుడ్‌ నటి గాల్‌కు తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది. ’అందరికీ నమస్కారం.. విూకు నా ముద్దులు’ అని పలకమంది. ఆ పదాలను గాల్‌ అతికష్టంవిూద పలికే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. టామ్‌ హార్పర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఎª`లాట్‌ఫామ్‌ నెట్‌ప్లిక్స్‌ ద్వారా ఆగస్టు 11న విడుదలవుతోంది. ఇంగ్లీష్‌, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ నెట్‌ ప్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.