డైరెక్టర్ హను రాఘవపూడి లాంచ్ చేసిన కృష్ణ వంశీ, మోక్ష ‘అలనాటి రామచంద్రుడు’ నాన్న సాంగ్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా నుంచి నాన్న సాంగ్ ని లాంచ్ చేశారు. కంపోజర్ శశాంక్ తిరుపతి ఈ పాటని హార్ట్ టచ్చింగ్ బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. చిలుకూరి ఆకాష్ రెడ్డి లిరిక్స్ ఆకట్టుకునేలా వున్నాయి. అంజనా బాలకృష్ణన్, శ్రాగ్వి ప్లజంట్ వోకల్స్ ఫీల్ గుడ్ వైబ్ ని క్రియేట్ చేశాయి.

ఈ మూవీలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

ప్రేమ్ సాగర్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జే సి శ్రీకర్ ఎడిటర్.

నటీనటులు : కృష్ణ వంశీ, మోక్ష, బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి, దివ్య శ్రీ గురుగుబెల్లి, స్నేహమాధురి శర్మ తదతరులు

టెక్నికల్ విభాగం :
రచన & దర్శకత్వం :-చిలుకూరి ఆకాష్ రెడ్డి
నిర్మాత:-హైమావతి, శ్రీరామ్ జడపోలు
బ్యానర్:-హైనివా క్రియేషన్స్
అసోసియేట్ నిర్మాత:-విక్రమ్ జమ్ముల
డీవోపీ:-ప్రేమ్ సాగర్
సంగీతం:-శశాంక్ తిరుపతి
ఎడిటర్:-జే సి శ్రీకర్
లైన్ ప్రొడ్యూసర్ & ప్రొడక్షన్ డిజైనర్ :-అవినాష్ సామల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :-గద్దల అన్వేష్
సాహిత్యం :- చంద్రబోస్, రాకేందు మౌళి, శ్రేష్ట, భరద్వాజ్ గాలి, డా. జి. సుమతి
సహ రచయిత :-శ్రీకాంత్ మందుముల
ఆర్ట్ డైరెక్టర్ :-రవిదర్. పి
కాస్ట్యూమ్స్ డిజైనర్:-జాగృతిరెడ్డి ఆగుమామిడి, శ్వేతా మురళీ కృష్ణ
అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ :-మణికంఠ. పి
స్టంట్ మాస్టర్ :-వింగ్ చున్ అంజి
సౌండ్ డిజైనర్లు :-సాయి మనీంధర్ రెడ్డి
కొరియోగ్రఫీ :-వై. మెహర్ బాబా & అజ్జు
ప్రొడక్షన్ కంట్రోలర్ – రమేష్ ఉప్పలపాటి
ప్రొడక్షన్ కోఆర్డినేటర్ – అనూష సూరపనేని
పీఆర్వో:-వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్:-మాయాబజార్