ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న సినిమాకు `ఆకాశం దాటి వస్తావా` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియోగ్రాఫర్ యష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. కార్తీక మురళీధరన్ హీరోయిన్. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను సోమవారం మేకర్స్ మీడియా ప్రతినిధుల చేతుల మీదుగా విడుదల చేశారు. శశి కుమార్ ముతులూరి దర్శక్వంలో హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “ ఓసందర్భంలో కొరియోగ్రాఫర్ యష్‌ను చూడగానే బావున్నాడనిపించింది. నా సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇస్తానని అన్నాను. బలగం సినిమా సెట్స్‌పై ఉన్న సమయంలో శశిని పిలిచి బలగం తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయాలని అన్నాను. అలా అనుకున్నప్పుడు కొరియోగ్రాఫర్ యష్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాం. తనకు ఆల్ రెడీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాతో అదింకా పెరుగుతుంది. సింగర్ కార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. శశి, యష్, హర్షిత్, హన్షితలకే ఈ క్రెడిట్ దక్కుతుంది. అన్నీ పాటలను ఎక్స్‌ట్రార్డినరీగా చేయించారు. ఇదొక మంచి మ్యూజికల్ మూవీ. కొత్త టాలెంట్‌ను పరిచయం చేయాలనే డి.ఆర్.పి బ్యానర్‌లో శశి, యష్‌లతో మరో ప్రయత్నం చేస్తున్నాం. మహేష్ ఈ సినిమాకు స్టోరి, డైలాగ్స్ అందించారు. యూత్‌ఫుల్ సినిమాను తీసుకొస్తున్నాం. ఈ సినిమాకు `ఆకాశం దాటి వస్తావా` అనే టైటిల్‌ను పెట్టాం. శశి పర్సనల్ లైఫ్ నుంచి ఈ స్టోరీని చేశారు. తన పర్సనల్ నుంచి వస్తోన్న స్టోరి కావటంతో చాలా కష్టపడుతున్నాడు. ప్రేమికులుగా ఉన్నప్పుడు అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కదా.. అదే ఈ సినిమా టైటిల్. ఔట్ అండ్ ఔట్ యూత్‌ఫుల్ కంటెంట్ ఇది. త్వరలోనే సినిమాను మీ ముందుకు సినిమాను తీసుకొస్తాం“ అన్నారు.
రైటర్ మహేష్ మాట్లాడుతూ “దిల్‌రాజుగారి కాంపౌండ్‌లో వర్క్ చేసే అవకాశాన్ని నాకు డైరెక్టర్ శశిగారు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాను. కొరియోగ్రాఫర్ యష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, డైరెక్టర్ శశి, యష్‌లకు థాంక్స్“ అన్నారు.
కార్తీక మురళీధరన్ మాట్లాడుతూ “దిల్ రాజుగారితో కలిసి సినిమా చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మలయాళంలో ఇది వరకు రెండు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా తొలి సినిమా. యష్, శశి వంటి మంచి టీమ్‌తో పనిచేశాను. తెలుగు ప్రేక్షకులు ఆశీర్వాదాన్ని అందిస్తారని భావిస్తున్నాను“ అన్నారు.
డైరెక్టర్ శశికుమార్ మాట్లాడుతూ “నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి దిల్ రాజుగారు నన్నుపిలిచారు. ఎవరైనా జీవితంలో అన్నీ బంధాలకు ప్రేమ, టైమ్, డబ్బులను సమానంగా ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ రిలేషన్‌లో గొడవలు జరుగుతాయి. ఇదే పాయింట్‌తోనే సినిమా చేస్తామని చెప్పి కథ చెప్పాను. రాజుగారికి నచ్చటంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. దిల్ రాజు కొత్త వాళ్లతో చేసిన సినిమాల్లో 99 శాతం సక్సెస్‌లను సాధించాయి. ఇప్పుడు డి.ఆర్.పి బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం బలగం కూడా పెద్ద హిట్. మాది రెండో సినిమా. రాజుగారి జడ్జ్‌మెంట్‌కు ఓ విలువ ఉంది. ఆకాశం దాటి వస్తావా అనేది కూడా ఆయన జడ్జ్‌మెంట్. మేం దానికి ప్రతినిధులుగా వ్యవహరించాం. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. యష్ డాన్స్‌ను నేను చాలానే చూశాను. ఇప్పుడు తనతోనే సినిమా చేశాను. ఈ సినిమాకు లవ్ అనేది మెయిన్ సోల్. ఈ టైటిల్ పెట్టటానికి కారణం తెలియాలంటే టీజర్ చూడాల్సిందే. సినిమాలో 6 అద్భుతమైన పాటలు ఉన్నాయి. హర్షిత్, హన్షిత్ గారు సపోర్ట్‌తో మంచి ఔట్‌పుట్‌ను మీ ముందుకు తీసుకొస్తాం“ అన్నారు.
హీరో యష్ మాట్లాడుతూ “ఇదంతా నాకొక కలలాగానే ఉంది. రాజుగారికి థాంక్స్. రాజుగారు ఫోన్ చేసి పిలవగానే ఆయన సినిమాలో కొరియోగ్రఫీ చేయాలేమోనని వెళ్లాను. తీరా హీరో నువ్వేనని చెప్పగానే ఆశ్చర్యపోయాను. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను. నేను ఈ సినిమా చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి థాంక్స్. శశిగారికి థాంక్స్. హర్షిత్‌గారు, హన్షిత గారికి థాంక్స్. `ఆకాశం దాటి వస్తావా` మంచి లవ్ జర్నీ. అవకాశం ఇచ్చినందుకు థాంక్స్“ అన్నారు.