‘హరోం హర’ ప్రోమోస్ ఎక్సయిటింగ్ గా వున్నాయి: హీరో అడివి శేష్

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సుధీర్ బాబు ఆడియో ఇంట్రాక్షన్ ని రిలీజ్ చేశారు. ఆడియో ఇంట్రాక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హరోం హర టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ట్రైలర్ చూశాను. చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించారు. బ్యాగ్ డ్రాప్, ప్రిమైజ్ కొత్తగా వుంది. ఈ రోజుల్లో ఆడియన్స్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ని ఇష్టపడుతున్నారు. హరోం హర టైటిల్ ట్రాక్ చాలా నచ్చింది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు గా వచ్చిన విశ్వక్, అడివి శేష్ కి థాంక్స్. మా నాన్న గారు ఫస్ట్ టైం నా సినిమాకి సంబధించిన ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. ఆయన రైట్ సినిమాకే వచ్చారని నాకు తెలుస్తుంది. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో ‘నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏమ్ ఫర్ ది లెవంత్ మైల్’ అని వుంటుంది. నేను ట్వెల్త్ మైల్ కి గురి పెట్టాను. కొట్టాను. ఒక సాలిడ్ సినిమా తీసి, ఎంతో మందికి చూపించి, వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాను. ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోతుంది, ఈ ఫ్రేం ఎలా చూస్తే అదిరిపోతుందనే అప్రోచ్ తో ఈ సినిమా చేశాం. ట్రైలర్ లో చూస్తున్న ప్రతి డిటేయిల్ టీం అందరి ఎఫర్ట్ వుంది. ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఎలాంటి సినిమా రాలేదు. సినిమా చూసినప్పుడు ఆడియన్స్ ఇదే ఫీల్ అవుతారు. జూన్ 14న ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సూపర్ స్టార్ట్ కృష్ణ గారు నా మావయ్య. నా హీరో. హరోం హర ఆయన కోరుకున్న సినిమా. ఆయన నన్ను ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలని అనుకున్నారో అలాంటి సినిమా అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను. ఆయన ఆశీస్సులు వుంటాయి.

డైరెక్టర్ జ్ఞానసాగర్ ఓ తుపాకీ పట్టుకొచ్చి ఈ కథని నెరేట్ చేశాడు. తను ఊహించిన వరల్డ్ ఎలా వుంటుందో క్లియర్ గా అర్ధమైయింది. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ పై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్ కి థాంక్స్. ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్ళినా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా వుంటుంది. ప్రొడ్యూసర్స్ సుమంత్, సుబ్రహ్మణ్యం ఈ కథకు ఫుల్ గా జస్టిస్ చేశారు. ఈ సినిమాతో ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ గా నిలబడతారు. డివోపీ అరవింద్ అదరగొట్టాడు. చేతన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. మ్యూజిక్ అదిరిపోయింది. సినిమా చూసిన ప్రతి ఆడియన్ సుబ్రమణ్యంలా ఫీలౌతాడు. దీనికి ముఖ్య కారణం చేతన్ ఇచ్చిన మ్యూజిక్. తన ఫ్యూచర్ లో పెద్ద హీరోలతో పని చేస్తాడనే నమ్మకం వుంది. ఆర్ట్ డైరెక్టర్ రాము గారు ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఎడిటర్ రవితేజ గారు ఎక్స్ లెంట్ గా చేశారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. హీరోయిన్ మాళవిక చాలా స్ట్రాంగ్ రోల్ చేసింది. తనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. సునీల్ గారు ఫుల్ లెంత్ రోల్ లో కం కనిపిస్తారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అర్జున్, లక్కీ లక్ష్మణ్.. అందరికీ పేరుపేరున థాంక్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి థాంక్స్. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా సపోర్ట్ ఇచ్చారు. మహేష్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎట్ లీస్ట్ త్రీ ఇయర్స్ పట్టొచ్చు. ఆ స్పెస్ నేను పూర్తి చేస్తానని చెప్పడం లేదు. అది ఏ హీరో వల్ల సాధ్యం కాదు. మహేష్ సినిమా ఫుల్ బాటిల్ కిక్ ఇస్తుంది. కానీ నేను ఒక్కటి చెప్పగలను. నేను ఫుల్ బాటిల్ ఎంటర్ టైన్మెంట్, కిక్ ఇవ్వలేను కానీ చిన్న పెగ్ అయితే ఇస్తాను. మహేష్ సినిమా విడుదలయ్యేలోపల ప్రతి సినిమాతో చిన్న పెగ్ పెగ్ ఇస్తూ ఫుల్ బాటిల్ ఇస్తాననే నమ్మకం వుంది. అది హరోం హరతో మొదలౌతుంది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చాయి. కుప్పం నుంచి చంద్రబాబు గారు గెలిచారు. జూన్ 14న సుబ్రహ్మణ్యం హరోం హర నుంచి వస్తున్నాడు. వాడూ గెలుస్తాడు. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ అంతా కాలర్ లేపుకుంటూ వెళ్తారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాకపోయినా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు మా హీరోకి కూడా ఇలాంటి పడితే బావుటుందని ఫీలౌతారు. హరోం హర అలాంటి సినిమా అవుతుంది. జూన్ 14 హరోం హర ప్లీజ్ డూ వాచ్’ అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈవెంట్ కి రావడం చాలా హ్యాపీగా వుంది. హరోం హర ని డే వన్ నుంచి ఫాలో అవుతున్నాను. ప్రోమోస్ అన్ని చాలా బావున్నాయి. ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్ ఇంత మంచి సినిమా చేస్తున్నాడని ఈ ఈవెంట్ కి వచ్చాను. డైరెక్టర్ టేకింగ్ అదిరిపోయింది. సినిమా విడుదలకు నాలుగైదు రోజులు ముందే డిస్ట్రిబ్యూటర్స్ ని పిలిచి షో వేశారంటే ఎంత ధైర్యం వున్న ప్రొడ్యూసరో అర్ధం చేసుకోవచ్చు. చేతన్ మ్యూజిక్ చాలా నచ్చింది. అరవింద్ మ్స్ చాలా బావున్నాయి. జూన్ 14న అందరూ కుమ్మేయాలి. అన్నీ పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. నేను గూఢచారి చేస్తున్నపుడు సుధీర్ గారు ఎంతో కేర్ అండ్ సపోర్ట్ చేశారు. ఆ సినిమాలో యంగ్ అడివి శేష్ గా చేసింది సుధీర్ గారి అబ్బాయి దర్శన్. ఆ సినిమా కోసం దర్శన్ మా సినిమా కోసం కోచ్ చేశారు. సుధీర్ డెడికేషన్ అలా వుంటుంది. సుధీర్ చాలా మంచి సినిమా చేశారు. సుధీర్ లాంటి బాడీ నాకు రావాలని కోరుకుంటున్నాను( నవ్వుతూ) టీం అందరికీ గుడ్ లక్’ చెప్పారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రామెసింగ్ గా వుంది. డైరెక్టర్ ని చూసి షాక్ అయ్యా. తను చాలా ఎనర్జీ మెంటైన్ చేస్తున్నారు. సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. సినిమా చూసిన వారు చెప్పారు. డీవోపీ అరవింద్ ఎక్స్ ట్రార్డినరీ గా వర్క్ చేశారు. చేతన్ మ్యూజిక్ చాలా బావుంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి పాషన్ వున్నా ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ కావాలి. నా సినిమా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత.. సుబ్రహ్మణ్యం గారిని సఫరేట్ సఫరేట్ డేట్ వస్తే కుదురుతుందా అని అడిగాను. ఒక్కమాట కాదనకుండా నాకు డేట్ ఇచ్చారు. సుధీర్ బాబు, సుబ్రహ్మణ్యం గారికి థాంక్స్. ఈ సినిమా డెఫినెట్ గా బావుటుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయండి’అని కోరారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం గారు చాలా పాషన్ వున్న నిర్మాత. ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా నా ఫ్రెండ్స్ అందరూ బావుందని చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సుధీర్ బాబు గారు ఎలాంటి సినిమా ద్వారా ఆడియన్స్ దగ్గరికి రావాలని అనుకుంటున్నారో అలాంటి సినిమా హరోం హర. డైరెక్టర్ చాలా పాషన్ తో సినిమా తీశారు. జూన్ 14న సినిమా థియేటర్స్ కి వస్తుంది. ఇదే జూన్ లో ప్రేమకథా చిత్రమ్ విడుదలైయింది. సుధీర్ బాబు గారికి మామూలు సీజన్ కాదిది. మాకు అప్పుడు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ సినిమాతో మళ్ళీ గట్టిగా కొడతారు. అందులో డౌట్ లేదు. ప్రేమకథా చిత్రానికి కూడా మహేష్ బాబు గారు వచ్చి బ్లెస్ చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ.. సినిమా గురించి ఎక్కవ మాట్లాడదలచుకోలేదు. జూన్ 14న ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్. లార్డ్ మురగన్ ని ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నా. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్స్. రెండువేల మంది సెట్ లో వున్నప్పుడు కూడా నా టీం హ్యాండిల్ చేసింది. హరోం హర కథ రాసుకున్న తర్వాత సుధీర్ గారి చెప్పాను. సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. ఆ కథ చెప్పినప్పుడే సుధీర్ గారే నా సుబ్రమణ్యం అని అర్ధమైపోయింది. ప్రొడ్యూసర్స్ సుబ్రహ్మణ్యం, సుమంత్ నేను ఆడిన టీం అందరినీ ఇచ్చారు. డీవోపీ అరవింద్, మ్యూజిక్ చేతన్, ఎడిటర్ రవితేజ.. అందరూ అద్భుతంగా చేశారు. ఇంత పెద్ద కాన్వాస్ లో సినిమా చేయడం నిర్మాత పాషన్ వలనే సాధ్యమైయింది. మై దళపతి సుధీర్ బాబు గారు. ఆయన ఈ కథ ఎస్ చెప్పడంతోనే సక్సెస్ వచ్చేసింది. ఆయన చాలా సపోర్ట్ చేశారు, మా కంటే ఎక్కవ హార్డ్ వర్క్ చేశారు. హరోం హర పక్కా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి మాస్ సంభవం ఫర్ ష్యూర్. జూన్ 14న థియేటర్స్ కి రండి. కుమ్మేసుకుందాం’ అన్నారు.

ప్రొడ్యూసర్ సుమంత్ మాట్లాడుతూ.. విశ్వక్, శేష్ గారికి థాంక్ యూ. శశిగారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా కోసం రెండేళ్ళు హార్డ్ వర్క్ చేసాం. ఈ రెండేళ్ళ హార్డ్ వర్క్ జూన్ 14న పే చేస్తుందని గట్టి నమ్మకం వుంది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ థియేటర్ లో సినిమాకి వస్తుంది. అందరికీ థాంక్స్. సాగర్ ఒక హై లెవల్ లో సినిమా తీస్తే చేతన్ మరో హై లో మ్యూజిక్ చేశారు. సుధీర్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు. మా డాడీ కూడా థాంక్స్ చెప్పాలి. లవ్ యూ డాడీ’ అన్నారు

ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. అలాగే వందకు వంద పర్సెంట్ తో విజయం సాధించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారికి అభినందనలు. అలాగే మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న మా బాలయ్య బాబుకి శుభాకాంక్షలు. జై బాలయ్య. హరోం హరలో తండ్రి కొడుకుల ఎమోషన్ నాకు పర్శనల్ గా చాలా కనెక్ట్ అయ్యింది. ఇందులో హీరో పేరు సుబ్రహ్మణ్యం.. నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది కమర్శియల్ మాస్ మూవీ. సాగర్ అద్భుతంగా తీశారు. కెమరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ చించేశారు. విజువల్స్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా వుంటాయి. సుధీర్ బాబు గారు అద్భుతంగా చేశారు. చాలా కొత్తగా కనిపిస్తారు. ఫైట్స్ అదరగొట్టారు. సినిమా థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

డిస్ట్రిబ్యుటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ఆల్రెడీ చూశాం. ఇది సుధీర్ బాబుకి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అని అనుకుంటున్నాను. చాలా బాగా చేశారు. సాంగ్స్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వున్నాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అవుతారు. సాగర్ అద్భుతంగా తీశాడు. జూన్ 14న సినిమా వస్తుంది. సుధీర్ బాబు కెరీర్ ఆల్ టైం హయ్యస్ట్ రికార్డ్ కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.

ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం ట్రూ పాషన్ వున్న ప్రొడ్యూసర్. ఇలాంటి ప్రొడ్యూసర్ ని ఇండస్ట్రీ కాపాడుకోవాలి. సుధీర్ బాబు కి డెడికేషన్ వుంది, హార్డ్ వర్క్ వుంది. కానీ నాకు తను అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అని ఎక్కడో ఫీలింగ్ వుంది. తనకి రావాల్సిన గుర్తింపు రాలేదని నా ఫీలింగ్. ఈ సినిమా సుధీర్ కి ప్రోపర్ బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు.

ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. హరోం హర నాలుగు రోజుల నుంచి ఇండస్ట్రీలో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చూసిన అందరూ సూపర్ హిట్ అని చెబుతున్నారు, మంచి డిస్ట్రిబ్యుటర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత సుబ్రహ్మణ్యం గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. విజువల్స్,యాక్షన్, మ్యూజిక్ అద్భుతంగా వున్నాయి. సినిమాలో గూస్బంప్స్ మూమెంట్స్ వున్నాయి. ఆడియన్స్ షాక్ అవుతారు. తెలియకుండానే క్లాప్స్ కొట్టేస్తాం. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. సుధీర్ బాబు గారి చూస్తుంటే అతడులో మహేష్ బాబుని చూసినట్లు అనిపించింది. ఈ సినిమాతో సుధీర్ బాబు గారు కొరుకునే విజయం దక్కుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. జూన్ 14న ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లెస్ చేయమని కోరుతున్నా’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.