వెట్రిమారన్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మరియు తెలుగులో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆడుకాలం, అసురన్, వడ చెన్నై వంటి కల్ట్ చిత్రాలను అందించారు. ఈ దర్శకుడి విడుతలై సినిమా తెలుగులో “విడుదల పార్ట్ 1” తొలిసారి విడుదలై అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
విడుదల పార్ట్ 1 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి సమీక్షలను పొందింది. వెట్రిమారన్ ఈ రా స్టోరీని అద్భుతమైన సన్నివేశలతో అద్భుతంగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ రియలిస్టిక్ గా అనిపించాయి. రైలు ప్రమాద సన్నివేశం మొత్తం సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు.
ప్రతి పాత్ర వెనుక ఆయన చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. అతని అసలైన మరియు గ్రామీణ చిత్ర నిర్మాణ శైలి అందరిని సప్రైజ్ చేసింది. ఈ సినిమాలో సమాజాన్ని ప్రశ్నించే సామాజిక సందేశం మరియు సాధారణ ప్రజలు వ్యవస్థ యొక్క మరొక వైపు కూడా చూసేలా చేస్తుంది. సూరి, విజయ్ సేతుపతి మరియు భవానీ శ్రీల నటన కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ తప్పక చూడాలి. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు వెట్రిమారన్. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్. వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసారు. లెజెండరీ సంగీత విద్వాంసులు మాస్ట్రో ఇళయరాజా చిత్ర సౌండ్‌ట్రాక్‌ను సమకూర్చారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.