శాసనసభ చిత్రం నటుడిగా నాకు గుర్తింపు తెస్తుంది

రక్తకన్నీరు నాగభూషణం మనవడు, దర్శకుడు మీర్ తనయుడు అబీద్ భూషణ్ నటిస్తున్న తాజా చిత్రం శాసనసభ. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఇంద్రసేన కథానాయకుడు. భూషణ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ నెల 16న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా భూషణ్ మాట్లాడుతూ పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్‌ఆర్‌కు దగ్గరగా వున్న పాత్రలో కనిపించబోతున్నాను. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో శాసనసభలో నేను ఈ గొప్ప పాత్రను పోషించాను.

ఎన్నికల సమయంలో ఆయన ప్రజలతో కలిసిపోయిన విధానం, ఆయనలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ నా పాత్రకు ప్రేరణ ఇచ్చాయి. తప్పకుండా ఈ చిత్రం నాకు నటుడిగా మంచి పేరును తెస్తుందనే నమ్మకం వుంది. దీంతో పాటు నేను ప్రధాన పాత్రలో నటిస్తున్న ్రైస్టెకర్ అనే చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయి అని తెలిపారు.