దిల్ రాజు ప్రొడక్షన్స్ ‘ఆకాశందాటి వస్తావా’ నుంచి ‘ఉన్నానో లేనో..’ రిలీజ్

‘బలగం’ వంటి సినిమాతో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. కామ్రేడ్ ఇన్ అమెరికా ఫేమ్.. మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంతో శశి కుమార్ ముతులూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘ఉన్నానో లేనో..’ అనే బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ తన అద్బుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. పాట మనసుని ఆహ్లాదంగా తాకే చిరుగాలిలా ఉంది. హీరోయిన్‌ని చూసిన హీరో తొలి చూపులోనే ప్రేమిస్తాడు. పార్టీలో ఆమెకు తనని తాను పరిచయం చేసుకుంటాడు. హీరో హీరోయిన్ల మధ్య కనిపిస్తోన్న బ్యూటీఫుల్ కెమిస్ట్రీ.. మ్యాజికల్ సాంగ్‌కి తగినట్లు వారిద్దరూ డాన్స్ చేసే తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ చూస్తున్న వారందరూ దానికి ఫిదా అయిపోతున్నారు. కచ్చితంగా అన్ని ప్లే లిస్టులో ఈ సాంగ్ టాప్‌లో ఉంటుందనటంలో సందేహం లేదు. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు: యశ్వంత్ మాస్టర్, కార్తీక మురళీధరన్ తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి
రచన, దర్శకత్వం: శశి కుమార్ ముతులూరి
మ్యూజిక్ డైరెక్టర్: కార్తీక్