విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రతి అప్‌డేట్ కోసం యూనిట్ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే టీజర్, సాంగ్ విడుదల చేశారు. ఈరోజు వీవీఐటీ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సినిమా సెకండ్ సింగిల్‌ని లాంచ్ చేశారు.
సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ‘సరదా సరదాగా’ పాటని మనసుని హత్తుకునే మెలోడీగా స్వరపరిచారు. వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య సాగే సంభాషణతో పాట ప్రారంభమవుతుంది. ఆమె అతని భార్య కాదు కానీ కుటుంబ సభ్యురాలిగా ఉండాలనుకుంటోంది. సారా పోషించిన వెంకీ కుమార్తె పాత్రతో పాటు ఇద్దరి చూడచక్కని ప్రయాణాన్ని ఆకట్టుకుంది.
జ్వరం ఉన్నప్పుడు పాప వెంకటేష్ ని చూసుకోవడం, తల్లి కాలమ్ లో శ్రద్ధ సంతకం చేయడం, వెంకీ తన కుమార్తెను ఉత్సాహపరిచేందుకు పాఠశాల వార్షిక వేడుకకు హాజరు కావడం లాంటి సన్నివేశాలతో ఈ పాట మనసుని హత్తుకుంది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వారి మధ్య బంధాన్ని మరింత అందంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఆ పాటకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. మొదటి పాట మాస్‌కి, యూత్‌కి బాగా కనెక్ట్ అయితే, రెండో సింగిల్ ఫ్యామిలీలకు కనెక్ట్ అవుతుంది.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎస్.మణికందన్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
సైంధవ్ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది.
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణన్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: యస్.మణికందన్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్