కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఓ మహిళ తమ సమస్యలు చెప్పుకుంటూ మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన సిద్దరామయ్య ఆ మహిళ వద్ద ఉన్న మైక్ ను లాక్కొని చున్నీని గుంజారు. ఇది ఇప్పుడు కర్నాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. సిద్దరామయ్య తీరు రాజకీయ దుమారానికి దారి తీసింది.
ఓ మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అని మహిళ సంఘాలు విమర్శించాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి కనీసం సిగ్గు లేకుండా ప్రవర్తించారని వారు విమర్శించారు. సిద్దరామయ్య యావత్తు మహిళా లోకాన్ని అవమాన పరిచారన్నారు. సిద్దరామయ్య వెంటనే మహిళకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సిద్దరామయ్య మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కింద ఉంది చూడండి.