సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా.. ఈ స్కీమ్ గురించి తెలుసా?

కేంద్ర ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లకు బెనిఫిట్ కలిగేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న ఇలాంటి స్కీమ్స్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. తక్కువ మొత్తంలో ఆదాయం ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా వడ్డీ రాయితీని పొందవచ్చు.

 

మహిళలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా హొమ్ లోన్ పొందే అవకాశం ఉండగా ఈ హోమ్ లోన్ కు సబ్సిడీ వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంటుందని తెలుస్తోంది. 20 సంవత్సరాల లోన్ తీసుకునే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజకరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఈ స్కీమ్ కు సంబంధించి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది.

 

ఈ స్కీమ్ కు చెందిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని చట్టబద్ధమైన పట్టణాలలో అమలు చేస్తోంది. గరిష్టంగా 6 లక్షల రూపాయల వరకు లోన్ పై ఈ వడ్డీ రేటును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయ వర్గాలను బట్టి లోన్ మొత్తంలో మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. సమీపంలో బ్యాంక్ లను, సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.

 

విభాగాన్ని బట్టి 12 లక్షల రూపాయల వరకు కూడా లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ గృహ రుణాలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.